ఉగ్రవాదంపై సౌదీ ఉక్కుపాదం.. 37 మందికి శిరచ్ఛేదం
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న సౌదీ అరేబియా చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కఠిన చట్టాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సౌదీ అరేబియా.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్న వారిని మరణశిక్ష అమలు చేసింది. సౌదీలో దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పుడుతున్నారని 37 మందికి ఒకేసారి మరణశిక్ష విధించినట్లు పేర్కొంది. ఈ మరణ శిక్షలు రియాద్, మక్కా, మదీనా, సెంట్రల్ ఖాసిం ప్రావిన్స్, ఈస్ట్రన్ ప్రావిన్స్‌లలో అమలు చేశారు. ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించడం, అతివాదం, దేశభద్రతను […]
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న సౌదీ అరేబియా చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కఠిన చట్టాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సౌదీ అరేబియా.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్న వారిని మరణశిక్ష అమలు చేసింది. సౌదీలో దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పుడుతున్నారని 37 మందికి ఒకేసారి మరణశిక్ష విధించినట్లు పేర్కొంది. ఈ మరణ శిక్షలు రియాద్, మక్కా, మదీనా, సెంట్రల్ ఖాసిం ప్రావిన్స్, ఈస్ట్రన్ ప్రావిన్స్‌లలో అమలు చేశారు.
ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించడం, అతివాదం, దేశభద్రతను అస్థిరపరిచేందుకు టెర్రరిస్ట్ సెల్స్ ఏర్పాటు వంటి అభియోగాలపై ఆ 37 మందికి మరణశిక్ష విధించారు. వారిలో ఒకరిని మరణశిక్ష అనంతరం స్తంభానికి వేలాడదీశారు. మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడినవాళ్లకు ఇలాంటి శిక్ష విధిస్తారు. సాధారణంగా సౌదీలో మరణశిక్ష అంటే శిరచ్ఛేదనంతో చంపేస్తారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు 100 మందికి మరణశిక్ష విధించినట్టు సౌదీ మీడియా పేర్కొంది.