S 500 Missile System: ఆ క్షిపణి వ్యవస్థ భారత్ సొంతం కాబోతోంది.. ఇక చైనాకు దబ్బిడి.. దిబ్బిడే..!
త్వరలో S-500 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను పొందే అవకాశం ఉంది. రష్యా ఉప ప్రధాని యూరి బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
S 500 Missile System: త్వరలో S-500 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను పొందే అవకాశం ఉంది. రష్యా ఉప ప్రధాని యూరి బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. S-500 ఒప్పందంపై భారత్, రష్యాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని కొన్ని నెలలుగా ప్రపంచ మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నందున ఈ వాదనను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించినప్పుడు చర్చ తీవ్రమైంది. అయితే, భారతదేశం S-500ని కొనుగోలు చేస్తే, అది చైనాకు షాక్ కలిగించడం ఖాయం. ఎందుకంటే చైనా వద్ద S-400 ఉంది. భారతదేశం కూడా ఇప్పటికే దానిని కొనుగోలు చేస్తోంది.
రష్యా డిప్యూటీ పీఎం బోరిసోవ్ ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ – ప్రపంచంలోనే S-500 కొనుగోలుదారుగా భారతదేశం అవతరించగలదని నేను భావిస్తున్నాను. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముందుగా మన సైన్యాన్ని ఈ వ్యవస్థతో సన్నద్ధం చేయాలనుకుంటున్నాం. దీని తర్వాత భారతదేశం మా మొదటి ప్రాధాన్యత. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ రకమైన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్.. క్షిపణి వ్యవస్థ లేదు. ఇది పూర్తి క్షిపణి షీల్డ్. ప్రస్తుతం ఇది మన సైన్యానికి సరఫరా అవుతోంది” అని వెల్లడించారు.
S-500 చివరి పరీక్ష 2019 లో ఉత్పత్తి ఆర్డర్‌కు ముందు జరిగింది. దీని తరువాత రష్యన్ సైన్యం కోసం దాని ఉత్పత్తి ప్రారంభమైంది. విశేషమేమిటంటే, టర్కీ S-500ని కొనుగోలు చేయడానికి చాలా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పటికే S-400 కలిగి ఉంది. రష్యా నుంచి దాని కొనుగోలు కారణంగా, అమెరికా టర్కీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. అయినప్పటికీ, టర్కీ S-500 పై దృష్టి పెట్టడం విశేషం.
భారతదేశానికి S-400 డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనితో అమెరికా ఆగ్రహంతో ఉంది. అయినప్పటికీ దాని ప్రత్యేక చట్టం ‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్’ (CAATSA)ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించలేదు. సుఖోయ్ ఎస్-30 ఎయిర్‌క్రాఫ్ట్, టీ-30 ట్యాంకులు, ఏకే-203 సిరీస్ రైఫిళ్లను కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. వీటిని రష్యా టెక్నాలజీతో.. సహకారంతో భారతదేశంలోనే తయారు చేస్తారు.
ఒప్పందం సులభం కాదు,
సూపర్ అడ్వాన్స్‌డ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ S-500 లేదా S-500 SAM గురించి భారతదేశం.. రష్యా ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ప్రశ్న చాలా రోజులుగా పాక్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో చర్చలు జరుగుతున్నాయి. చైనాలో మీడియా సెన్సార్ షిప్ వల్ల ఇలా ఏదీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఎస్-400పై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రశ్న ఏమిటంటే, అమెరికా S-500లో కూడా మౌనంగా ఉంటాడా? భారతదేశం.. రష్యా మధ్య వండుతున్న కిచిడీ గురించి అమెరికాకు తెలియదా? అమరికా ఈ ఒప్పందాన్ని అనుమతిస్తుండా? ఈ ఒప్పందం చైనా.. రష్యా మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేయలేదా? ఈ ఒప్పందం ఆసియాలో ఆయుధ పోటీకి కొత్త మార్గాన్ని తెరవలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలమే తేల్చాలి. చూద్దాం ఏం జరుగుతుందో.