Russia Bomb: ఉక్రెయిన్‌పై ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగం.. వీడియో విడుదల చేసిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను ప్రయోగించినట్టు ప్రకటించింది. అయితే తమ ప్రజలను భయపెట్టేందుకే రష్యా ఇలాంటి కట్టుకథలు సృష్టిస్తోందని ఉక్రెయిన్ కౌంటర్ ఇచ్చింది.
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను ప్రయోగించినట్టు ప్రకటించింది. అయితే తమ ప్రజలను భయపెట్టేందుకే రష్యా ఇలాంటి కట్టుకథలు సృష్టిస్తోందని ఉక్రెయిన్ కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించినట్టు రష్యా ప్రకటించింది. తాజా దాడితో ఉక్రెయిన్ వణికిపోయింది. FAB-3000 లేదా FAB-1500 బాంబులను ఉక్రెయిన్‌పై తప్పకుండా ప్రయోగిస్తామని రష్యా చాలా రోజుల నుంచి చెబుతోంది. తాజా దాడి గురించి రష్యా వీడియో కూడా విడుదల చేసింది. ఖార్కీవ్ ప్రాంతంలో రష్యా ఈ బాంబును ప్రయోగించినట్టు గుర్తించారు.
అయితే రష్యా ఈ బాంబును ప్రయోగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఉక్రెయిన్ చెబుతోంది. కావాలనే రష్యా సైన్యం పుకార్లను వ్యాపింపచేస్తోందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఖార్కీవ్ ప్రాంతంలో ప్రజల్లో భయపెట్టేందుకునే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపింది. చాలా తక్కువ సామర్ధ్యం ఉన్న బాంబును మాత్రమే రష్యా వాడిందన్నారు. రష్యా దాడులను తమ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఖార్కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో రష్యా దురాక్రమణను తమ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోందన్నారు.
రష్యా వాడిన బాంబు 44 వేల కేజీల బరువు ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జనావాసాలపై ఇలాంటి బాంబులను ప్రయోగించడంపై రెడ్‌క్రాస్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన యుద్ద నేరాల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు ఏ యుద్దంలో కూడా ఇలాంటి బాంబులు ఉపయోగించలేదుని అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..