ఉక్రెయిన్‌పై అణుదాడికి రష్యా సిద్ధం అవుతోందా?. ఏ క్షణమైనా ఈదాడి జరగొచ్చనే వదంతులు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా న్యూక్లియర్ డ్రిల్ నిర్వహించింది రష్యా.. ఈ డ్రిల్‌ను సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు.. పుతిన్ కంట్రోల్ రూమ్‌లో కూర్చొని డ్రిల్‌ను చూస్తున్నట్లు వీడియోలను విడుదల చేసింది రష్యా అధ్యక్ష భవనం. ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించే అవకాశం ఉందని ఆరోపణలు చేసిన రష్యా కొద్ది గంటల్లోనే న్యూక్లియర్ డ్రిల్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న సమాచారం తమ దగ్గర ఉందని రష్యా ఆరోపించింది.
రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబుతో మానవాళికి చాలా హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రష్యా లేఖ రాసింది. ఈ బాంబును స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంపై ప్రయోగించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుందని రష్యా చెబుతోంది.. అయితే రష్యా చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అమెరికా, యూరోప్ దేశాల సమాఖ్య కూడా రష్యా విమర్శలను తోసిపుచ్చింది.. నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ మీద రష్యా అణుదాడి చేస్తే క్షమించరాని నేరం చేసినట్లే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఉక్రెయిన్ వార్ కాస్తా న్యూక్లియర్ వార్‌గా రూపుదిద్దుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..