Russia Ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. 120 మిస్సైళ్లతో భారీ విధ్వంసం.. గంటలో..
ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడింది రష్యా. గంట సమయంలో 120 మిస్సైళ్లను ప్రయోగించింది. అంటే నిముషానికి రెండు మిస్సైళ్ల చొప్పున ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు ప్రయోగించాయి.

ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడింది రష్యా. గంట సమయంలో 120 మిస్సైళ్లను ప్రయోగించింది. అంటే నిముషానికి రెండు మిస్సైళ్ల చొప్పున ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు ప్రయోగించాయి. ఈ దాడుల్లో భారీ నష్టం జరిగింది. ఉక్రెయిన్లోని కీవ్, ఒడెసాతో పాటు లీవ్ తదితర నగరాలపై రష్యా సైన్యం భీకర దాడులు చేసింది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కీవ్‌లో సగం జనం కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖేర్సన్ నగరంపై కూడా 33 క్షిపణులను ప్రయోగించింది రష్యా. తాజా దాడులతో ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా దాడులకు రష్యా అధునాతన డ్రోన్లను వినియోగించినట్టు తెలుస్తోంది. రష్యా తాజా దాడుల్లో కీవ్‌లో ముగ్గురికి గాయాలయ్యాయి. 13 ఏళ్ల బాలికకు కూడా క్షిపణిదాడిలో గాయాలయ్యాయి.
రష్యా దాడుల్లో పరిశ్రమలతో పాటు చాలా మౌలిక వసతులకు డ్యామేజ్ జరిగినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఖర్కీవ్, ఒడెశా, ల్వీవ్, జైటోమిర్ నగరాలు క్షిపణి దాడులతో దద్దరిల్లిపోయాయి. అన్ని దిక్కుల నుంచి ఒకేసారి రష్యా క్షిపణి దాడులు చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. గగనతలం నుంచి, సముద్రం నుంచి క్షిపణులను, భారీ సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను ఈ దాడులకు వినియోగించారు.
రష్యా తాజా దాడులతో ప్రజలు బంకర్లలో ఆశ్రయం తీసుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది ఉక్రెయిన్. మైకలోవ్‌లో ఐదు క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశారు. రష్యా మరిన్ని దాడులు చేసే అవకాశముందని ఉక్రెయిన్ రక్షణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..