AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Imran Khan: మాతో స్నేహం కావాలంటే కాశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్న పాక్ ప్రధాని

PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్టికల్ 370 పై మళ్ళీ పాడిన పాటె పాడారు. భారత దేశం తమ దేశంతో మంచి సంబబంధాలను నెరపాలంటే జమ్మూ కాశ్మీర్ కు ఉన్న..

PM Imran Khan:  మాతో స్నేహం కావాలంటే కాశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్న పాక్ ప్రధాని
Pak Pm Imran Khan
Surya Kala
|

Updated on: Jun 03, 2021 | 9:24 PM

Share

PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్టికల్ 370 పై మళ్ళీ పాడిన పాటె పాడారు. భారత దేశం తమ దేశంతో మంచి సంబబంధాలను నెరపాలంటే జమ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అంతవరకూ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు సాధారణ స్థితికి రావని చెప్పారు. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరు ను రెండు ప్రాంతాలుగా విడదీస్తూ.. ప్రత్యేక హోదాను రద్దు చేశారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు.

అంతేకాదు.. భారత్, పాక్ , ఆప్ఘనిస్తాన్ లు సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు నెలకొనాలని, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని చెప్పారు. అప్పుడే అభివృద్ధి సాధించవచ్చునని, ఇదే పాకిస్థాన్ ముందు ఉన్న సవాల్ అని చెప్పారు.

అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించి జమ్మూ -కశ్మీరుపై విషయంపై భారత్ ఏక పక్ష నిర్ణయం తీసుకుందని .. దీంతో తమకు భారత్ తో వాణిజ్య సంబంధాలను కొనసాగించడం తమకు కష్టంగా మారిందన్నారు.  తాము కాశ్మీరీలు చేరిన త్యాగాలను వృద్ధకానివ్వమని.. అందుకనే వారి త్యాగాలకు ద్రోహం చేయకుండా విలువైచ్చి భారత్ తో వాణిజ్య సంబంధాలను నెరపడం లేదని వెల్లడించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

Also Read: సూపర్ కిడ్.. రెండున్నరేళ్ల ఈ బాలిక తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా..