Indian Rupee: ఇప్పుడు భారత్ ‘రూపాయి’ ఇండోనేషియాలో చెల్లుబాటు.. ఆర్బీఐ కీలక ఒప్పందం

అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత్, ఇండోనేషియా కేంద్ర బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం భారతదేశంలోని సంస్థలు, ఇండోనేషియాలోని సంస్థల మధ్య వ్యాపారం చేసేటప్పుడు భారతీయ రూపాయి (INR), ఇండోనేషియా రూపాయి

Indian Rupee: ఇప్పుడు భారత్ 'రూపాయి' ఇండోనేషియాలో చెల్లుబాటు.. ఆర్బీఐ కీలక ఒప్పందం
RBI
Follow us
Subhash Goud

|

Updated on: Mar 08, 2024 | 9:57 AM

అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత్, ఇండోనేషియా కేంద్ర బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం భారతదేశంలోని సంస్థలు, ఇండోనేషియాలోని సంస్థల మధ్య వ్యాపారం చేసేటప్పుడు భారతీయ రూపాయి (INR), ఇండోనేషియా రూపాయి (IDR-Rupiah) కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం.

రెండు దేశాల నుండి ఎగుమతిదారులు వారి స్థానిక కరెన్సీలో ఇన్వాయిస్ చేయవచ్చు. అలాగే దిగుమతిదారులు వారి స్థానిక కరెన్సీలో కూడా చెల్లించవచ్చు. ఉదాహరణకు, ఒక ఇండోనేషియా సంస్థ భారతదేశానికి వస్తువులను ఎగుమతి చేయడానికి వారి కరెన్సీలో ఇన్‌వాయిస్‌ను పంపుతుంది. భారతదేశంలోని సంస్థలు రూపాయి కరెన్సీలో చెల్లింపులు చేయవచ్చు. ఇది జరిగితే ఇరు దేశాల కరెన్సీ బలపడుతుంది. డాలర్ల ద్వారా కాకుండా నేరుగా లావాదేవీ చేయడం ద్వారా ధర కూడా తగ్గుతుంది.

వివిధ దేశాలతో ఇటువంటి ద్వైపాక్షిక సహకార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. 2023 జూలై నెలలో UAI మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రెండు అవగాహన ఒప్పందాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ స్వదేశాలకు డబ్బు పంపేందుకు వీలుగా యూపీఐని వివిధ దేశాలకు విస్తరించేందుకు, లేదా ఇక్కడి నుంచి విదేశాలకు డబ్బు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. UPI సింగపూర్, శ్రీలంక, UAE మొదలైన దేశాల చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించబడింది. దీంతో తక్కువ ఖర్చుతో నగదు బదిలీ సాధ్యమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి