ఇరాన్ లో హిజాబ్స్ ను వ్యతిరేకించినందుకు 22ఏళ్ల మహ్సా అమినీ పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. మహ్సా అమినీ మరణాన్ని నిరసిస్తూ ఆదేశ మహిళలు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ జట్టు కత్తిరించుకుని నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహ్సా అమినీ మరణంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మహ్సా అమినీ మరణాన్ని నిరసిస్తున్న ఇరానియన్ మహిళలకు మద్దతుగా ప్రియాంక చోప్రా బయటకు వచ్చింది, ‘ఐ స్టాండ్ విత్ యూ’ అని చెప్పింది.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా గ్రామ్ లో చేసిన పోస్ట్ లో “యుగాల నుంచి బలవంతంగా అణిచివేస్తున్న గొంతులు మౌనం వీడి తమ స్వరాన్ని అగ్ని శిఖరం బద్దలైనట్లు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మరణించిన మహ్సా అమినీ మరణానికి నిరసనగా వేలాది మంది ఇరాన్ మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఆమె మరణం ఇరాన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర నగరాల్లో నిరసనలకు దారితీసింది. అనేక మంది నటీమణులు ముందుకు వచ్చి ఇరాన్ మహిళలకు తమ మద్దతును ప్రకటించారు.
ప్రియాంక చోప్రా ఇరానియన్ మహిళలకు మద్దతు:
తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియాలో ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచింది. తన సోషల్ మీడియా వేదికగా “నేను మీతో నిలబడతానని స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..