PM Modi: మరచిపోలేని దృశ్యాలు.. అంతర్జాతీయ యోగా దినోత్సవ వీడియోను షేర్ చేసిన ప్రధాని మోడీ..

|

Jun 22, 2023 | 11:30 AM

YogaDay programme in New York City: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఊరు వాడ.. పట్టణం.. నగరం.. ఇలా దేశ విదేశాల్లో అంతా యోగా చేసి.. యోగా దినోత్సవంలో భాగస్వామ్యమయ్యారు.

PM Modi: మరచిపోలేని దృశ్యాలు.. అంతర్జాతీయ యోగా దినోత్సవ వీడియోను షేర్ చేసిన ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

YogaDay programme in New York City: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఊరు వాడ.. పట్టణం.. నగరం.. ఇలా దేశ విదేశాల్లో అంతా యోగా చేసి.. యోగా దినోత్సవంలో భాగస్వామ్యమయ్యారు. కాగా.. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకోనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అగ్రరాజ్యంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. దీంతో న్యూయార్క్ లోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయం సందడిగా మారింది.. ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగిన యోగా దినోత్సవంలో ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాల ప్రతినిధులు, ప్రవాసులు ఇలా అంతా కలిసి యోగాసనాలు వేశారు.

శారీరక, మానసిక ఆరోగ్యం యోగాతోనే సాధ్యమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యోగా ఆరోగ్యంతోపాటు.. బలం, శక్తిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. యోగా ప్రాముఖ్యతని తెలుసుకుని విదేశీయులు సైతం మేము సైతం.. యోగా ఆసనాలు వేయానికి అన్నంతగా ఆసక్తిని కనబర్చారు. కాగా.. యూఎన్ఓ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ స్వయంగా ట్విట్టర్లో షేర్ చేశారు. న్యూయార్క్ నగరంలో YogaDay కార్యక్రమానికి సంబంధించి మరచిపోలేని దృశ్యాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

UNO ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. యోగా అంటేనే ఐక్యత అని పేర్కొన్నారు. మీరంతా చాలా దేశాల నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. యోగా అంటే ఐక్యత. 9 ఏళ్ల క్రితం ఇక్కడే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టాం. యోగా అంటేనే అందరినీ కలిపేది.. అంటూ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.