AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: చైనా శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై ముగ్గురు దేశాధినేతల బిగ్‌ షేక్‌హ్యాండ్‌

చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకు ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మూడు దేశాల అధినేతలైన నరేంద్ర మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ ఒకె ప్రేమ్‌లో కనిపించారు. ఒకరికొకరు షేక్యాండ్‌ ఇచ్చుకొని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత సదస్సులో పాల్గొనేందుకు ముగ్గురు కలిసి వెళ్లారు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

Video: చైనా శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ఒకే వేదికపై ముగ్గురు దేశాధినేతల బిగ్‌ షేక్‌హ్యాండ్‌
Modi's Visit To China
Anand T
|

Updated on: Sep 01, 2025 | 10:16 AM

Share

చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ SCO ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా సదస్సు మూడు దేశాల అధినేతలు షెక్యాండ్‌ ఇచ్చుకొని, ఆలింగనం చేసుకున్నారు. అదేవిదంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆత్మీయంగా పలకించారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి సదస్సులో పాల్గొన్నారు.

అయితే ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోను భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దాని కింద పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చైనా పర్యటనలో ఉన్న ప్రధానీ మోదీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత వారితో మరిన్ని చర్చలు జరపున్నట్టు సమాచారం.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.