Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Hamas War: వాషింగ్టన్ డీసీలో మిన్నంటిన నిరసనలు.. ఆందోళన చేస్తున్న పాలస్తీనా మద్దతుదారుల అరెస్ట్

వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ భవనం లోని కానన్ రోటుండాను చుట్టుముట్టారు. ప్లకార్టులను ప్రదర్శిస్తూ ర్యాలీగా వచ్చి క్యాపిటల్ భవనం లోపలికి చొచ్చుకుపోయారు. కింద కూర్చొని క్లాప్స్ కొడుతూ ఆందోళన తెలిపారు. నిరసనల్లో వందలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న 300 మంది నిరసనకారులను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ నిరసనల కారణంగా క్యాపిటల్ భవనం దగ్గర గందరగోళం నెలకొంది.

Israel-Hamas War: వాషింగ్టన్ డీసీలో మిన్నంటిన నిరసనలు.. ఆందోళన చేస్తున్న పాలస్తీనా మద్దతుదారుల అరెస్ట్
Palestinian Protesters
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 6:34 AM

ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం టెల్ అవీవ్‌ను సందర్శించిన తర్వాత అమెరికా క్యాపిటల్ భవనం సహా పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకు దిగిన పాలస్తీనా మద్దతుదారులు 300 మంది అరెస్ట్ చేశారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని అమెరికా ఇచ్చిన హమీతో .. అగ్రరాజ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. తక్షణమే కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ పాలస్తీనా మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తక్షణమే ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాన్ని ఆపేయాలని నినదించారు. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ భవనం లోని కానన్ రోటుండాను చుట్టుముట్టారు. ప్లకార్టులను ప్రదర్శిస్తూ ర్యాలీగా వచ్చి క్యాపిటల్ భవనం లోపలికి చొచ్చుకుపోయారు.

ఇవి కూడా చదవండి

కింద కూర్చొని క్లాప్స్ కొడుతూ ఆందోళన తెలిపారు. నిరసనల్లో వందలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న 300 మంది నిరసనకారులను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ నిరసనల కారణంగా క్యాపిటల్ భవనం దగ్గర గందరగోళం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ మూసేశారు. ఎవరూ లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు.

విజిటర్స్‌కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక తలుపుని తెరిచి ఉంచారు. అందులో నుంచే లోపలకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ బిల్డింగ్‌ని వీలైనంత వరకూ సేఫ్‌గా ఉంచేందుకు ప్రయత్నించారు పోలీసులు. పెద్ద ఎత్తున మొహరించారు. చుట్టూ కంచెలు, బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్‌కి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా. ఇప్పటికే జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో  భేటీ అయ్యారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ ఘోరమైన దాడి తర్వాత అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధంలో ఇరువైపులా ఇప్పటివరకు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..