AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahid Latif Dead: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం.. పాక్‌లో కాల్చిచంపిన గుర్తుతెలియని వ్యక్తులు

Pathankot Attack Mastermind Shahid Latif Killed: పఠాన్‌కోట్ దాడి సూత్రధారి, భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ విచారణలో తేలింది.

Shahid Latif Dead: పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం.. పాక్‌లో కాల్చిచంపిన గుర్తుతెలియని వ్యక్తులు
Shahid Latif
Sanjay Kasula
|

Updated on: Oct 11, 2023 | 2:32 PM

Share

పాకిస్తాన్‌లో నక్కిన టాప్‌ టెర్రరిస్టులు ఒక్కొక్కరు ఆకస్మాత్తుగా ఖతం అవుతున్నారు . పంజాబ్‌ లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడిలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.

పఠాన్‌కోట్ దాడి సూత్రధారి, భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ విచారణలో తేలింది. పాకిస్థాన్‌లోని ఒక మసీదులో గుర్తు తెలియని దుండగులు అతన్ని కాల్చి చంపారు. అతను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్ నగరంలో హత్యకు గురయ్యాడు.

పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడికి ప్లానర్..

పఠాన్‌కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్‌లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది. దాడి చేసేందుకు భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదుల సూత్రధారులు, హ్యాండ్లర్లు పాకిస్థాన్‌లోనే ఉన్నారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్‌.. 2016, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌ దాడికి వ్యూహరచన చేశాడు. దానిని అమలు చేయడానికి సియాల్‌కోట్‌ నుంచి నలుగురు ఉగ్రవాదులను పంపించాడు. 1994, నవంబర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద లతీఫ్‌ను పోలీసులు భారత్‌లో అరెస్టు చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు.. వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్థాన్‌కు పరారయ్యాడు.

మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుగా..

పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత జైషే మహమ్మద్‌లో చేరిన లతీఫ్‌ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌లో అతడు నిందితుడిగా ఉన్నాడు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అతడిని మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుగా ప్రకటించింది..

పఠాన్‌కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్‌లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది. దాడి చేసేందుకు భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదుల సూత్రధారులు, హ్యాండ్లర్లు పాకిస్థాన్‌లోనే ఉన్నారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

47 ఏళ్ల షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలోని అమీనాబాద్ పట్టణంలోని మోర్ గ్రామంలో నివాసి. షాహిద్ లతీఫ్‌ను జైషే లాంచింగ్ కమాండర్‌గా పిలుస్తారు. నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు.

షాహిద్ 11 ఏళ్ల పాటు భారత జైల్లో..

షాహిద్ లతీఫ్ 1993లో ఉగ్రవాద ఆరోపణలపై భారతదేశంలో అరెస్టయ్యాడు. అతనిపై విచారణ జరిపి జైలుకు పంపారు. షాహిద్ లతీఫ్ దాదాపు 11 ఏళ్ల పాటు భారతీయ జైలులో బంధిగా ఉన్నాడు. భారత్‌లో శిక్షాకాలం పూర్తయిన తర్వాత 2010లో పాకిస్థాన్‌కు పంపబడ్డాడు. భారత్ నుంచి బహిష్కరణకు గురైన షాహిద్ లతీఫ్ తిరిగి పాకిస్థాన్‌లోని జిహాదీ ఫ్యాక్టరీకి వెళ్లి పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడని NIA దర్యాప్తులో తేలింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి