Watch: ఫ్లైట్ రెక్కల పైనుంచి దూకిన ప్యాసింజర్స్..18మందికి గాయాలు.. అసలేం జరిగిందంటే..?
స్పెయిన్‌లో విమానం రెక్కల పైనుంచి ప్యాసింజర్స్ దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. సుమారు 18మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో ఫైర్ లైట్ వెలగడంతో ప్రయాణికులు భయపడి పరుగులు తీశారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

గత కొన్ని రోజులుగా తరుచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఓ మూలన ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలో అహ్మదాబాద్ విమానం ప్రమాదాన్ని ఎవరు మర్చిపోరు. అంతటి విషాదాన్ని మిగిల్చింది. ఏకంగా 250 మందికిపైగా ఆ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఒకేసారి 26వేల అడుగులు కిందికి దిగడంతో ప్రయాణికులు గజగజ వణికిపోయారు. ఈ ఘటనలన్నీ మరవక ముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయంలో టేకాఫ్‌కు రెడీగా ఉన్న రైయానైర్ బోయింగ్ 737 విమానంలో ఫైర్ అలర్ట్ లైట్ వెలిగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనతో విమానం నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. మాంచెస్టర్‌కు వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
జూలై 4న రైయానైర్ బోయింగ్ విమానం పాల్మా నుండి మాంచెస్టర్ వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. ఇంతలో ఫైర్ లైట్ వెలిగింది. దీంతో ప్రయాణికులంతా భయంతో పరుగుల తీశారు. కొంత మంది ఎమర్జెన్సీ మార్గం ద్వారా కిందకు దిగారు. మరికొంత మంది మాత్రం భయంతో విమానం రెక్కల పైనుంచి కిందికి దూకారు. దీంతో 18మందికి గాయాలయ్యాయి. అయితే స్వల్ప గాయాలే అయ్యాయని.. పెద్ద గాయలు కాలేవని అధికారులు తెలిపారు. కాసేపటి ఎమర్జెన్సీ టీమ్ సైతం ఘటనాస్థలికి చేరుకుంది. అయితే అది ఫేక్ లైట్ అని గుర్తించడంతో అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చారు. ఇటీవల అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అయితే ఆ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Passengers leap on WING to flee low-cost plane FIREBALL pic.twitter.com/oI1Dp7nnvG
— RT (@RT_com) July 5, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..