Nirav Modi: అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడి అరెస్ట్.. భారత్‌కు అప్పగింత ఎప్పుడు..?
బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడి సోదరుడిని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌కు అప్పగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తితో అరెస్ట్ చేశారు. అయితే నీరవ్ మోడీతో పాటు అతడి కుటుంబసభ్యులను భారత్ తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తప్పు చేసి తప్పించుకుంటామని చాలా మంది అనుకుంటారు. అదే ధీమాతో తప్పులు చేస్తారు. కానీ చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష తప్పదు. చాలా కేసుల్లో రుజువైంది ఇదే. మోసం చేసి విదేశాలకు పారిపోయిన శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష పడటం కొన్నిసార్లు లేట్ అవ్వొచ్చు కానీ పడటం మాత్రం ఖాయం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటారా.. ఇక్కడి బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ కథ చెప్పేది కూడా ఇదే. ఇక్కడి వ్యవస్థలను మేనేజ్ చేసి వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆరేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అతడొక్కడే కాదు ఈ స్కాంతో సంబంధం ఉన్న అతని కుటుంబసభ్యులని సైతం దర్యాప్తు సంస్థలు వదలలేదు.
తాజాగా అమెరికాలో నీరవ్ మోడీ బ్రదర్ నేహాల్ దీపక్ మోడీ అరెస్ట్ అయ్యారు. మొత్తం రూ.13,500 కోట్ల రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో నీరవ్ 2018లో యూకే పారిపోయాడు. అయితే 2019లో ఆయన్ని లండన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు బెయిల్ కోసం అప్లై చేసుకున్నా ఆయనకు నిరాశే ఎదురైంది. ఎలాగైన అతడిని తీసుకరావాలని భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదే కేసులో నీరవ్ మోడీ మామ మోహుల్ చోక్సీ కూడా ఇటీవలే బెల్జియంలో అరెస్టయ్యాడు. ఇప్పుడు దీపక్ మోడీ కూడా అరెస్ట్ కావడం గమనార్హం.
బ్యాంకులను మోసం చేసిన కేసులో దీపక్ మోడీ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. కీలక ఆధారాలను నాశనం చేయడంలో, సాక్షులను బెదిరించడం, దర్యాప్తును అడ్డుకోవడంలో నేహల్ మోడీ పాత్ర పోషించారని అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా బ్యాంకులను మోసం చేసిన డబ్బును మళ్లీ వైట్ మనీగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని.. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా వైట్‌గా మార్చారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతడిని భారత్‌కు అప్పగించే విషయంపై ఈ నెల 17న కోర్టులో విచారణ జరగనుంది. అదే రోజు అతడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. అయితే బెయిల్ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..