Japan: జపాన్‌లో బద్దలైన షిన్మోడాకే అగ్నిపర్వతం – మాంగా కార్టూన్ జోస్యం నిజమవుతుందా..?
జపాన్‌లోని క్యుషూ దీవుల్లో ఉన్న షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై 3న భారీగా విస్ఫోటనమైంది. వేల మీటర్ల ఎత్తువరకు పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. పేలుడు ముందు ఆ ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక స్థాయిని పెంచి ప్రజలను అప్రమత్తం చేసింది.

జపాన్‌లోని షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై 3న బద్దలయ్యింది. అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. 3,000 మీటర్ల ఎత్తు వరకూ పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు తాజాగా ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్నిపర్వతం సమీపానికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆదేశించారు. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం, అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ 3 వేల మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. గత రెండు వారాలుగా కగొషీమా ప్రిఫెక్చర్‌లో వెయ్యికి పైగా భూప్రకంపనలు వచ్చాయి. దక్షిణ క్యూషూలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కగోషీమా ప్రిఫెక్చర్‌లో వెయ్యికి పైగా భూమి కంపనలు ఇటీవల నమోదు అయ్యాయి. ఓవైపు, భూప్రకంపనలు, మరోవైపు అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. రాబోయే ప్రకృతి విపత్తులకు సంకేతాలుగా భావించి జనం భయంతో వణికిపోతున్నారు. రోయో టాట్సూకీ రూపొందించిన మాంగా కార్టూన్‌లో పేర్కొన్న జోస్యం నిజం కాబోతోందని టెన్షన్ పడిపోతున్నారు.
రోయో టాట్సూకీ అనే చిత్రకారిణి 1999లో తన మాంగా కార్టూన్‌లో జపాన్‌ను సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు. ఆ జోస్యం 2011లో నిజం కావడంతో రోయో పాప్యులారిటీ పెరిగిపోయింది. ఇక 2021లో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్‌లను విడుదల చేసిన ఆమె 2025 జులైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు. సునామీ ముంచెత్తుతుందని హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..