AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ali Azim: మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు.. మాల్దీవులు అధ్యక్షుని పీఠానికి ముప్పు..

ప్రధాని నరేంద్రమోదీతో పాటు, భారతీయులపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. దీంతో అక్కడి ముగ్గురు మంత్రులపై వేటు పడింది. అయితే ఇంతటితో ఈ వ్యవహారం సర్థుమణగడం లేదు. దీని ప్రభావం మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజు పై పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న విధంగా అక్కడి మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ దేశ అధ్యక్షుడిపై ప్రభావం చూపుతోంది.

Ali Azim: మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు.. మాల్దీవులు అధ్యక్షుని పీఠానికి ముప్పు..
Maldives
Srikar T
|

Updated on: Jan 09, 2024 | 1:29 PM

Share

ప్రధాని నరేంద్రమోదీతో పాటు, భారతీయులపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. దీంతో అక్కడి ముగ్గురు మంత్రులపై వేటు పడింది. అయితే ఇంతటితో ఈ వ్యవహారం సర్థుమణగడం లేదు. దీని ప్రభావం మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజు పై పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న విధంగా అక్కడి మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ దేశ అధ్యక్షుడిపై ప్రభావం చూపుతోంది. మాల్దీవుల వ్యవహారాన్ని అక్కడి పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ రాజకీయంగా ఉపయోగించుకోనున్నారు. మహ్మద్ ముయిజుపై అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్న మొయిజును పదవినుంచి తొలగించాలని తోటి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

తమ దేశ విదేశాంగ విధానాన్ని కాపాడటం కోసం, టూరిజం వ్యవస్థపై ఏర్పడిన వ్యతిరేకతను నిర్మూలించడం కోసం, తమ దేశ ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ అజీమ్ తెలిపారు. ఈ విషయాన్ని తన సామాజిక మధ్యమ వేదికైన ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా మాల్దీవుల్ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూను అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను దెబ్బ తీసేలా ముయిజ్జూ పని చేస్తున్నారని పార్లమెంటరీ మైనార్టీ నాయకుడు అలీ అజీమ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత పలువురు మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. మన భారత్ లో మాల్దీవులకు మించిన సుందరమైన సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయన్నారు. మరి కొందరైతే బైకాట్ మాల్దీవ్స్ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఆ దేశ టూరిజం వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. అలాగే పలు ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు గానూ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం భారత్‌లోని మాల్దీవుల రాయబారిని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను తమ కార్యాలయానికి పిలిపించి మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..