Congo Fever: బక్రీద్‌కు ముందు పాక్‌లో కాంగో వైరస్ వెలుగులోకి.. చికిత్స, వ్యాక్సిన్ లేని ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..

|

May 25, 2024 | 6:13 PM

ఆసియా, ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. CCHF మొదటిసారిగా 1944లో క్రిమియాలో వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని పేరు పెట్టారు. 1960 ల చివరలో కాంగోలో ఇలాంటి వ్యాధి వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఈ వైరస్ పేరు క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరంగా మార్చబడింది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు.

Congo Fever: బక్రీద్‌కు ముందు పాక్‌లో కాంగో వైరస్ వెలుగులోకి.. చికిత్స, వ్యాక్సిన్ లేని ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..
Congo Hemorrhagic Fever Virus (2)
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా బక్రీదు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే బక్రీద్‌కు ముందే ప్రమాదకరమైన వైరస్ కారణంగా పాకిస్థాన్ ప్రమాదంలో పడింది. దీని పేరు క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్. దీనిని కాంగో వైరస్ అని కూడా అంటారు. దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా వైరస్ నుంచి రక్షణకు సంబంధించి పౌరులకు కొన్ని సలహాలు సూచనలను జారీ చేసింది. కాంగో ఫీవర్ అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం పాకిస్తాన్‌కు ఇది ఎందుకు తలనొప్పిగా మారుతుందో తెలుసుకుందాం.

CCFH అనేది నైరోవైరస్ (సాలెపురుగులకు సంబంధించినది) వల్ల కలిగే వైరల్ జ్వరం. గతేడాది కూడా పాకిస్థాన్‌లో కాంగో వైరస్‌ వ్యాప్తి చెందింది. పాకిస్తాన్‌లో 2023లో101 కేసులు నమోదయ్యాయి. నాలుగింట ఒక వంతు మంది మరణించారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు.

కాంగో జ్వరం అంటే ఏమిటి, వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే?

CCHF వైరస్ తీవ్రమైన ప్రపంచ ఆరోగ్య ముప్పుగా పరిగణించబడుతుంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. CCHF మొదటిసారిగా 1944లో క్రిమియాలో వెలుగులోకి వచ్చింది. అప్పుడు దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని పేరు పెట్టారు. 1960 ల చివరలో కాంగోలో ఇలాంటి వ్యాధి వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఈ వైరస్ పేరు క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరంగా మార్చబడింది.

ఇవి కూడా చదవండి

కాంగో వైరస్ జంతువుల శరీరానికి అంటుకునే హ్యూమరల్స్ అని పిలువబడే పేలు (పరాన్నజీవులు) ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఈ పరాన్నజీవులు కాటు వేసినా లేదా ఈ వైరస్ సోకిన జంతువు రక్తం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ గొర్రెలు, మేకల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఆ దేశ ఆరోగ్య శాఖ సిబ్బంది జారీ చేసిన సలహా ప్రకారం.. ఈ వైరస్ సోకిన బాధితుల రక్తం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

పాకిస్తాన్‌లో కాంగో వైరస్ ఎంత బలంగా ఉంది?

కాంగో వైరస్ కేసులు నమోదవుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఆసియాలో నాల్గవ అతిపెద్ద దేశం. టర్కియే, రష్యా , ఇరాన్ దేశాల్లో కూడా ఈ వైరస్ బాధితులు వెలుగులోకి వచ్చారు. 1976లో మొదటిసారిగా పాకిస్తాన్‌లో CCHF వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో జంతువుల నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వలన ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది.

బక్రీద్ కు కాంగో వైరస్‌కి సంబంధం ఏమిటంటే?

ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బక్రీద్ సందర్భంగా కాంగో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘బక్రీద్ కారణంగా అన్ని ప్రావిన్సుల నుంచి జంతువుల రవాణా పెరిగింది. దీని కారణంగా సాధారణ ప్రజలకు, జంతువుల మధ్య సంబంధం పెరిగింది. దీని కారణంగా కాంగో జ్వరం వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగింది.

వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి సలహాలు ఇచ్చారంటే?

ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేనందున అధిక ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అడ్వైజరీలో, ఫుల్ స్లీవ్‌లు , లేత రంగు దుస్తులు ధరించాలని కోరారు. లేత రంగు దుస్తులు ధరించడం ద్వారా పేలు సులభంగా కనిపిస్తాయి. అంతే కాకుండా కీటకాలను దూరంగా ఉంచే క్రీములను రాసుకోవాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..