Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Crisis: అప్పుల కొండ.. ఆర్థిక సంక్షోభం అంచున నిలుస్తున్న 15 దేశాల జాబితాలో పాక్..

తక్కువ ఆదాయం, 45 శాతం అప్పులతో ఒత్తిడిని ఎదుర్కొనే దేశాల జాబితాల్లో పాకిస్థాన్‌ ఒకటిగా చేర్చవచ్చు.. అత్యధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునే దేశంగా పాకిస్తాన్ ఉన్నట్లు బిజినెస్ రికార్డర్ వెల్లడించింది. అయితే దీనికి ఎటువంటి పరిష్కారం లేకుండా దేశ ఆర్ధిక కొరతను సృష్టించినట్లు కనిపిస్తోందన్నారు.

Pakistan Crisis: అప్పుల కొండ.. ఆర్థిక సంక్షోభం అంచున నిలుస్తున్న 15 దేశాల జాబితాలో పాక్..
Pakistan
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2023 | 12:16 PM

మన పొరుగు దేశం పాకిస్తాన్ లో రోజు రోజుకీ సంక్షోభం పెరిగిపోతుంది. ఓ వైపు దాయాది దేశానికి పెరుగుతున్న విదేశీ రుణాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పడుతుంటే.. మరో వైపు దేశంలోపల పెరుగున్న వస్తువుల ధరలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తానీయుల జీవితంపై ప్రభావితం చేసే విధంగా ఆర్ధిక విశ్లేషకుడు అతీఖ్ ఉర్ రెహమాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. ప్రపంచంలో అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన దేశాల్లో ఒకటి పాకిస్థాన్ అని తెలిపాడు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అపారమైన అప్పుల ఒత్తిడిలో ఉన్న 15 దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటని బిజినెస్ రికార్డర్ నివేదించింది.

ఇదే విషయంపై ఆర్థిక శాస్త్ర వేత్త, ఆర్థిక విశ్లేషకుడు అతీఖ్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ వీలైనంత త్వరగా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పారు. విదేశీ రుణంతో పాటు.. అధిక పాలసీ రేట్లను ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం దేశీయ రుణ ఖర్చులను ఎదుర్కొంటున్నదని.. ఇది మొత్తం 21 శాతం ప్రతికూలను కలిగి ఉందని నివేదిక పేర్కొంది.

రుణ ఖర్చులు మరింత పెరుగుతాయని భయపడుతున్న విశ్లేషకులు 

ఇవి కూడా చదవండి

2024 ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ బాహ్య ఫైనాన్సింగ్ అవసరం.. అయితే సుమారు US 40 బిలియన్ డాలర్లు.. పాకిస్తాన్ USD 30 బిలియన్ల (వడ్డీ చెల్లింపులతో సహా) బాహ్య రుణ చెల్లింపులను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్ కరెంట్ ఖాతాపై ప్రభావం పడి.. కరెంట్ ఖాతా ఎప్పుడూ తగ్గుతూనే ఉందని బిజినెస్ రికార్డర్ నివేదించింది. ఇప్పటికే పాకిస్తాన్ ఫైనాన్సింగ్ ఎంపిక చాలా అనిశ్చితంగా ఉందని చెప్పారు.

తక్కువ ఆదాయం, 45 శాతం అప్పులతో ఒత్తిడిని ఎదుర్కొనే దేశాల జాబితాల్లో పాకిస్థాన్‌ ఒకటిగా చేర్చవచ్చు.. అత్యధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునే దేశంగా పాకిస్తాన్ ఉన్నట్లు బిజినెస్ రికార్డర్ వెల్లడించింది. అయితే దీనికి ఎటువంటి పరిష్కారం లేకుండా దేశ ఆర్ధిక కొరతను సృష్టించినట్లు కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ లోని అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవాలి.. అదే సమయంలో ప్రభుత్వం తమ వ్యవహారాల్లో సరళతను పాటించాలని సూచించారు ఆర్థిక విశ్లేషకుడు అతీఖ్ ఉర్ రెహమాన్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..