పాకిస్తాన్(Pakistan) టెలివిజన్(పీటీవీ)కి చెందిన 17 మంది ఉద్యోగులను ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పాక్ ప్రధాని(Pak PM tour) షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు వెళ్లిన సమయంలో సరైన కవరేజీ ఇవ్వలేదన్న కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్.. ఏప్రిల్ 24న లర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు, రంజాన్ బజార్‌లను సందర్శించారు. ఆ సమయంలో ఎఫ్‌టీపీ(FTP) ద్వారా వీడియో ఫుటేజీని అప్‌లోడ్ చేయడానికి అవసరమైన ల్యాప్‌టాప్ అందుబాటులో లేదు. దీంతో పీటీవీ బృందం సరైన కవరేజీని అందించలేకపోయింది. లైవ్ స్ట్రీమింగ్, సరైన సమయంలో వీడియో ఫుటేజీల అప్‌లోడ్ కోసం అవసరమైన పరికరాలు ఉన్నాయి. కానీ పీటీవీ లాహోర్ కేంద్రంలోని సిబ్బంది వద్ద అధునాతన ల్యాప్‌టాప్ లేకపోవడంతో అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. పీఎం పర్యటన నేపథ్యంలోతమకు ల్యాప్‌టాప్ కావాలని అక్కడి సిబ్బంది ఛానెల్ హెడ్ ఆఫీస్ ను కోరారు. ఈ అంశంపై ఏప్రిల్ 18న కూడా ఓ లేఖ రాశారు. ‘లాహోర్ కేంద్రంలో ల్యాప్‌టాప్ ఎడిటింగ్ సదుపాయం లేదు. కాబట్టి, ఓదాన్ని అద్దెకు తీసుకున్నాం. కానీ, సొంత ల్యాప్‌టాప్ అత్యవసరం’ అని అందులో పేర్కొన్నారు. అయినా.. యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా, మరోసారి అద్దెకు తీసుకోవాలని సూచించింది. దీంతో వారు.. ఓ అధికారి వ్యక్తిగత ల్యాప్‌టాప్ తీసుకున్నారు.
ప్రధాని కార్యక్రమం కవరేజ్ తర్వాత ఫుటేజీని ఎఫ్‌టీపీ ద్వారా కార్యాలయానికి పంపించేందుకు యత్నించగా బ్యాటరీ అయిపోయింది. దీంతో పీటీవీ స్పాట్ దృశ్యాలను ప్రసారం చేయలేకపోయింది. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం.. వీవీఐపీ కవరేజ్ డిప్యూటీ కంట్రోలర్ ఇమ్రాన్ బషీర్ ఖాన్ తో పాటు మొత్తం 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!
Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..