Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Child care tip: పిల్లల ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే కాదు.. ఏళ్ల తరబడిగా మన పెద్ద చేస్తూ వచ్చిన సూచనలు కూడా అద్భుతంగా ఫలితాలనిస్తాయని అనేక సందర్భాల్లో రుజువైంది.

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!
Child Care Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 01, 2022 | 7:42 PM

Child care tip: పిల్లల ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే కాదు.. ఏళ్ల తరబడిగా మన పెద్ద చేస్తూ వచ్చిన సూచనలు కూడా అద్భుతంగా ఫలితాలనిస్తాయని అనేక సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా బాడీ మసాజ్(శరీర మర్ధన) పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది. శిశువు పుట్టిన తరువాత వారికి పెద్దన మర్ధన చేస్తారనే విషయం తెలిసిందే. ఈ మసాజ్ వారికి అన్ని విధాలుగా శ్రీరామ రక్ష లా పని చేస్తుంది. మసాజ్ చేయడం వలన ఎముకలు బలపడతాయి. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాదు.. బాడీ మసాజ్ మంచిగా చేయడం వలన పిల్లల జుట్టు కూడా వత్తుగా పెరుగుతుంది. ఆయిల్ మసాజ్ చేయడం వలన పిల్లలు చురుకుగా ఉండటంతో పాటు.. హాయిగా నిద్రపోతారు. ఇదిలాఉంటే.. వేసవి కాలంలో పిల్లలు ఒళ్లు కాలిపోతుంటుంది. ఇలాంటి సమయంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, పిల్లల శరీరం చలువగా ఉండటానికి కూడా ఆయిల్ మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, వేసవి కాలంలో పిల్లలకు మసాజ్ చేయడానికి ఏ నూనె‌ను ఉపయోగించాలి అనేది చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే వేసవిలో పిల్లల శరీరం చలవగా ఉండటానికి ఏ నూనెను వాడితే ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాజ్ చేసే నూనె సీజన్ ప్రకారం ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది ఆవనూనెతో పిల్లలకు మసాజ్ చేస్తుంటారని, అది సరికాదని చెబుతున్నారు వైద్యులు. అవాల నూనె పిల్లల శరీరంలో మరింత వేడిని పెంచుతుంది. అది వారికి చికాకు కలిగిస్తుంది. వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే.. కొబ్బరి నూనె వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ నూనె పిల్లల శరీరాన్ని చల్లగా చేస్తుందంటున్నారు. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంపై ఎక్కువ జిగట అనిపించదు. కొబ్బరి నూనెను చర్మం సులభంగా గ్రహిస్తుంది. ఈ కారణంగా వేసవిలో పిల్లలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలని సూచిస్తున్నారు.

కొబ్బరి నూనెతో ఆయిల్ మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు.. 1. పిల్లల్లో ఆకలిని పెంచుతుంది. 2. మీ శిశువు బరువు తక్కువగా ఉన్నట్లయితే.. కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల వారి బరువు పెరుగుతుంది. 3. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే శిశువు హృదయ స్పందన సమతుల్యగా ఉంటుంది. 4. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా వారు చురుకుగా ఉంటారు. 5. ఇంకా ముఖ్యంగా రక్త ప్రసరణను పెంచుతుంది.

Also read:

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..

Snake Doing Yoga: ఉదయాన్నే ‘ప్రాణయామం’ చేస్తున్న నాగుపాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!