Pakistan: చైనా పౌరులే లక్ష్యంగా కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు.. ముగ్గరు మృతి, 17 మందికి గాయాలు
ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన పెద్ద పేలుడులో ముగ్గురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలిందని.. ఇది పాకిస్థాన్‌లో అతిపెద్ద పేలుడు అని పోలీసులు, ప్రాంతీయ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి విదేశీయులను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ప్రావిన్షియల్ హోం మంత్రి జియా ఉల్ హసన్ అన్నారు.
ఆదివారం అర్థరాత్రి పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించడంతో నగరం మొత్తం వణికిపోయింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, దక్షిణ పాకిస్తాన్ నగరం కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు విదేశీ పౌరులు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) కారణంగానే పేలుడు సంభవించిందని.. ఈ దాడిలో ఒక చైనాకి చెందిన వ్యక్తీ కూడా గాయపడ్డాడని సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లాంజార్ తెలిపారు. మీడియా కథనాల ప్రకారం విమానాశ్రయం సమీపంలోని ప్రాంతం నుంచి దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.
పాకిస్థాన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మాట్లాడుతూ
#WATCH | Karachi, Pakistan: Deputy Inspector General East Azfar Mahesar says, “According to initial information, an oil tanker caught fire which spread to several other vehicles causing collateral damage. We are determining if there was an element of terrorism involved which we… pic.twitter.com/3T204tUSvr
— ANI (@ANI) October 7, 2024
పేలుడులో ముగ్గురు మృతి
ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన పెద్ద పేలుడులో ముగ్గురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలిందని.. ఇది పాకిస్థాన్‌లో అతిపెద్ద పేలుడు అని పోలీసులు, ప్రాంతీయ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి విదేశీయులను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ప్రావిన్షియల్ హోం మంత్రి జియా ఉల్ హసన్ అన్నారు.
చైనా పౌరులపై దాడి
ఇది చైనా పౌరులపై జరిగిన దాడి అని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. వేలాది మంది చైనీస్ కార్మికులు పాకిస్తాన్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది బీజింగ్ బిలియన్-డాలర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో పాల్గొంటున్నారు. ఇది దక్షిణ, మధ్య ఆసియాను చైనా రాజధానికి కలుపుతుంది.
ఈ ఘటనా స్థలంలోని కార్లలో మంటలు, పొగలు రావడం వీడియోలో కనిపిస్తోంది. ఘటనా స్థలంలో భారీగా సైనికులు మొహరించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇది ఆయిల్ ట్యాంకర్ పేలుడు అని అనిపిస్తోందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాకు తెలిపారు. తాము పేలుడు జరిగిన తీరుని, స్వభావం, కారణాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే దీనికి సమయం పడుతుందన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
కంపించిన విమానాశ్రయ భవనాలు
హోం మంత్రి, ఇన్‌స్పెక్టర్ జనరల్ కూడా పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.అయితే ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు. ఉత్తర నజీమాబాద్, కరీమాబాద్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం.
ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు
పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో విమానాశ్రయానికి సమీపంలోని కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రాంతం సాధారణంగా VIP ప్రోటోకాల్ వాహనాల కోసం ఉపయోగించబడుతుంది. ఘటనా స్థలంలో ఉన్న మరో జర్నలిస్టు మాట్లాడుతూ.. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే రోడ్డులో పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..