Nostradamus: కొత్త ఏడాదిలో పెను ముప్పు తప్పదా.. మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..

|

Dec 17, 2024 | 2:44 PM

2024  సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరం 2025 కి వెల్కమ్ చెప్పడానికి ప్రజలకు రెడీ అవుతున్నారు .  మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగు పెట్టనుండడంతో మరోసారి ప్రజల దృష్టి కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని పరిస్థితులు ఎలా ఉండనున్నాయి అని ఆలోచిస్తున్నారు. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ చెప్పిన అంచలనాలను తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తున్నారు.  

Nostradamus: కొత్త ఏడాదిలో పెను ముప్పు తప్పదా.. మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
Nostradamus Predictions For 2025
Follow us on

2025 మరికొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో జరగబోయే సంఘటనలను గురించి తెలుసుకోవడానికి మరోసారి ‘డూమ్ ప్రవక్త’ నోస్ట్రాడమస్ వైపు మొగ్గు చూపారు. మిచెల్ డి నోస్ట్రెడామ్‌లో జన్మించిన నోస్ట్రాడమస్ ఒక ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. వృత్తిరీత్యా వైద్యుడు. 1500లలో నివసించాడు. అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం, సెప్టెంబర్ 11 దాడులు, COVID-19 మహమ్మారి సహా అనేక సంఘటనలను అంచనా వేసాడు. అవనీ నిజం కావడంతో నోస్ట్రాడమస్ చెప్పిన భవిష్యత్ అంచనాలను నమ్మడమే కాదు కొత్త ఏడాది వస్తే చాలు భవిష్యత్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని చూపిస్తున్నారు .

 2025లో అంచనాలు ఏమిటంటే..

1555లో ప్రచురించబడిన లెస్ ప్రొఫెటిస్ (ది ప్రొఫెసీస్) అనే పుస్తకంతో ప్రసిద్ధి చెందాడు. ఈ పుస్తకంలో రానున్న కాలంలో ప్రపంచంలో జరిగే సంఘటనలను తెలియజేస్తూ  వివరించబడ్డాయి.  2025లో UKలో గ్రహశకలం ఢీకొనడం నుంచి మరొకసారి ప్లేగు వ్యాప్తి వంటి అనేక సంఘటనలు  నోస్ట్రాడమస్ అంచనా వేశాడు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు?

నోస్ట్రాడమస్ 2025 అంచనాలో ఒకటి దీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధాలలో ఒకటి ముగింపు దశకు చేరుకుంటుందని.. ఇరుపక్షాలు సుదీర్ఘ యుద్దాన్ని విరమించవచ్చు అని పేర్కొన్నాడు. 2022లో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ప్రస్తావిస్తూ ఇరుపక్షాలు యుద్దాన్ని విడిచిపెట్టవచ్చు అని అంచనావేశాడు.

ఇవి కూడా చదవండి

ప్లేగు.. యుద్ధం

ఓ వైపు యుద్ధాలతో ప్రజలు అల్లాడుతుంటే . . మరోవైపు మళ్ళీ ప్లేగు వ్యాధి విజృంభిస్తుందని ముఖ్యంగా    ఇంగ్లాండ్‌లో ఈ వ్యాధి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని నోస్ట్రాడమస్ అంచనా వేశారు. అతని COVID-19 మహమ్మారి అంచనా నిజమైంది  కనుక ..  నిపుణులు ఇది కూడా నిజం అవుతుందని భావిస్తారు.

భూమిని గ్రహశకలం ఢీట్టనుందా

నోస్ట్రాడమస్ 2025 భూమిని ఒక పెద్ద గ్రహశకలం  ఢీ కొట్టనుందని ..  అంచనా వేశారు.

బ్రెజిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు

నోస్ట్రాడమస్ “గార్డెన్ ఆఫ్ ది వరల్డ్”గా సూచించే దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్, వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవచ్చని  జోస్యం చెప్పారు .

నివేదికల ప్రకారం.. నోస్ట్రాడమస్ తన భార్య , చిన్న పిల్లలను అనారోగ్యంతో కోల్పోయాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి నోస్ట్రాడమస్ మానవాళికి సంభవించే వినాశనం, ప్రపంచంలోని చీకటి పరిస్థితిని అంచనా వేయడంలో ఓదార్పుని పొందాడని తెలుస్తుంది .

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..