పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. రహీం యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ సిటీలో సిద్ధివినాయక టెంపుల్ లోకి ప్రవేశించి నానా బీభత్సానికి పాల్పడ్డారు. ఈ సిటీవాసులను రెచ్చగొట్టేట్టుగా ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వారి ఆగ్రహానికి అంతు లేకపోయింది. గుంపులు..గుంపులుగా ఆలయంలోకి చొచ్చుకు వచ్చి విధ్వంస కాండకు దిగారు. ఇనుప రాడ్లు, కర్రలు, బండరాళ్లతో వస్తువులను, విగ్రహాలను ధ్వంసం చేశారు. పవిత్ర గ్రంథాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 100 హిందూ కుటుంబాలను రక్షించేందుకు పాకిస్థాన్ రేంజర్లను ప్రభుత్వం పంపింది. పాలక పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కి చెందిన డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ.. ఈ ఘోరం తాలూకు దృశ్యాల వీడియోను తన ట్వీట్లకు జోడిస్తూ..దీన్ని తక్షణమే నిలపాలని పోలీసులను, అధికారులను కోరారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, స్థానిక పోలీసులు ఉన్నా దీన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఉదాసీనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఇది చాలా సిగ్గుచేటు.. ఈ ఘటనకు సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ లో మతపరమైన మైనారిటీలను నాన్-సిటిజెన్స్ గా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో క్రెస్తవులు, హిందువులు, సిక్కులు తదితర మతాల వారిని ఇలా దేశ పౌరులు కానివారిగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ దేశంలోని పలు హిందూ సంఘాలు చాలాసార్లు ఈ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికే కాకుండా చివరకు ఐరాస దృష్టికి కూడా తేవడానికి యత్నించాయి.
It is very sad & unfortunate incident. PM office took notice of this untoward incident & directed district administration to probe the case & take strict action against the culprits.Pakistani constitution provides freedom & protection to minorities to perform their worship freely https://t.co/RuLOe69VSb
— Dr. Shahbaz GiLL (@SHABAZGIL) August 4, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.