న్యూజిలాండ్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న బంగ్లా క్రికెటర్లు

న్యూజిలాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. క్రిస్ట్‌చర్చ్ సెంట్రల్ సిటీలోని వేరువేరు మసీదులలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతుండగా.. ఒక నిందితుడు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్. ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లా క్రికెటర్లు కాల్పులు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లారు. ఆ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:12 am, Fri, 15 March 19
న్యూజిలాండ్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న బంగ్లా క్రికెటర్లు

న్యూజిలాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. క్రిస్ట్‌చర్చ్ సెంట్రల్ సిటీలోని వేరువేరు మసీదులలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతుండగా.. ఒక నిందితుడు పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

అయితే ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్. ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లా క్రికెటర్లు కాల్పులు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లారు. ఆ సమయంలోనే కాల్పులు జరగగా.. శబ్ధం విన్న ఆటగాళ్లు పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారు హోటల్‌లో సురక్షితంగా ఉన్నారని, దేవుడి దయ వలన ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్ కోచ్ మీడియాకు తెలిపారు.