అయ్యో పాపం.. చేయని నేరానికి 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి ఊహించని ట్విస్ట్

క్రిమినల్ కేసుల్లో కొన్నిసార్లు ఏమి తెలియని నిర్ధోషులు కూడా శిక్షకు బలవుతుంటారు. రోజులు, నెలలు, చివరికి సంవత్సరాలు కూడా జైలు గోడల మధ్య మగ్గిపోతుంటారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించే వారి బాధ వర్ణించలేనది. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

అయ్యో పాపం.. చేయని నేరానికి 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.. చివరికి ఊహించని ట్విస్ట్
Andrew Malkinson
Follow us
Aravind B

|

Updated on: Jul 29, 2023 | 10:03 AM

క్రిమినల్ కేసుల్లో కొన్నిసార్లు ఏమి తెలియని నిర్ధోషులు కూడా శిక్షకు బలవుతుంటారు. రోజులు, నెలలు, చివరికి సంవత్సరాలు కూడా జైలు గోడల మధ్య మగ్గిపోతుంటారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించే వారి బాధ వర్ణించలేనది. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా యూకేలో అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి చేయని నేరానికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 17 సంవత్సారాలు జైలు శిక్ష అనుభవించాడు. ఇంతకాలం పాటు జైలు జీవితం గడిపిన ఆ వ్యక్తిని న్యాయస్థానం పలు ఆధారాలతో నిర్దోషిగా తేల్చి చెప్పింది. బాధితుడికి న్యాయం జరగడంలో పొరపాటు జరిగిందని పేర్కొంటు న్యాయస్థానం క్షమాణాలు కోరింది. ప్రస్తుతం ఈ అంశం యూకేలో చర్చనీయాంశవుతోంది. వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన ఓ మహిళపై 2003 లో లైంగిక దాడి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సమీపంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆండ్రూ మాల్కిన్‌సన్ (57) అనే వ్యక్తిపై అభియోగాలు మోపారు.

దరాప్తు జరిగిన తర్వాత 2004లో ఆండ్రూని దోషిగా తెలుస్తూ న్యాయస్థానం ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత మరో పదేళ్ల పాటు శిక్ష విధించింది. దీంతో ఆండ్రూ దాదాపు 17 ఏళ్ల పాటు జైల్లోనే గడిపి 2020లో బయటకు వచ్చాడు. 2004 నుంచే ఆండ్రూ తాను ఎలాంటి తప్పు చేయలేదని వేడుకున్నాడు. రెండుసార్లు అధికారులు కూడా సమీక్ష జరిపినప్పటికీ అతనికి శిక్ష నుంచి ఎలాంటి మినహాయింపు జరదలేదు. చివరికి అతడి శిక్ష అనంతరం 2020 డిసెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో బాధుతురాలు చెప్పినట్లుగానే విచారణ కొనసాగింది. ఆండ్రూ బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ కేసు విచారణ కొనసాగింది. గతంలో అధికారులు సమీక్ష జరిపి ఇచ్చిన నివేదికపై ఆండ్రూ అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసును సవాలు చేశాడు. డీఎన్‌ఏ ఆధారాలను విశ్లేషించాలని పట్టబట్టాడు. దీంతో బాధితురాలి నుంచి సేకరించిన నమునాలు ఆండ్రుతో కాకుండా పోలీస్ డేటాబెస్‌లో ఉన్న మరో వ్యక్తితో సరిపోయాయి. దీంతో కేసు మలుపు తిరిగింది. అధికారులు సమర్పించిన ఆధారాల ప్రకారం న్యాయస్థానం ఆండ్రూని నిర్ధోషిగా అని తేల్చేసింది. అయితే తాను నిర్దోషి అని నిరూపించడానికి పోలీసు వ్యవస్థకు 20 ఏళ్లు పట్టిందని ఆండ్రూ తీవ్ర విచారం వ్యక్తం చేయడం అందరిని కంటతడి పెట్టించింది.