Watch Video: అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం.. గన్ జామ్ అవడంతో జస్ట్ మిస్..
అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్నర్‌పై గురువారం హత్యాయత్నం జరిగింది. ఫెర్నాండెజ్ ఇంటి ముందే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి దగ్గరి నుంచి కాల్చేందుకు..
అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్నర్‌పై గురువారం హత్యాయత్నం జరిగింది. ఫెర్నాండెజ్ ఇంటి ముందే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి దగ్గరి నుంచి కాల్చేందుకు ప్రయత్నించాడు. స్థానిక టెలివిజన్ ఫుటేజ్‌ను అక్కడి అధికారులు విడుదల చేశారు. ఈ సంఘటనలో ఉపరాష్ట్రపతి సురక్షితంగా ఉన్నట్లు వారు తెలిపారు. కాల్పులు జరిపేందకు ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన 35 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిస్టినా 2007-2015 వరకు అర్జెంటీనా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కొందరు ఆందోళనకారు నిరసన తెలుతున్నారు. వారి మధ్యలో నుంచి వచ్చి కాల్చేందుకు ప్రయత్నించాడు నిందితుడు.
నిందితుడిని 35 ఏళ్ల ఫెర్నాండో సబాక్ మోంటియల్‌గా గుర్తించారు. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దాడి చేసిన వ్యక్తి బ్రెజిలియన్ అని స్థానిక మీడియా పేర్కొంది. ఉపరాష్ట్రపతిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన వీడియో నిమిషాల వ్యవధిలోనే ఆ దేశ మీడియాలో వైరల్ అయ్యింది.
El video del arma contra @CFKArgentina pic.twitter.com/8j1xpMnPoe
— Lautaro Maislin (@LautaroMaislin) September 2, 2022
కాల్పులు జరుపుతుండగా తుపాకీ జామ్ అయ్యింది దీంతో తుపాకీ నుంచి బెల్లెట్స్ బయటకు రాలేదు. తుపాకీ పనిచేయకపోవడంతో నిందితుడు కాల్పులు జరపలేకపోయాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం