AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mine: బంగారు గనిలో భారీ ప్రమాదం.. కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం!

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం.

Gold Mine: బంగారు గనిలో భారీ ప్రమాదం.. కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం!
Gold Mine Collapse
Balaraju Goud
|

Updated on: Feb 16, 2025 | 8:55 PM

Share

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం(ఫిబ్రవరి 15) ఇక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిపోయి 48 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో మాలి ఒకటి. ఇక్కడి గనులలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గని కూలిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.

స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించగా, కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ మృతుల సంఖ్య 48గా పేర్కొంది. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి తెలిపారు. బంగారం ఇప్పటికే వెలికితీసిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. గతంలో ఈ గనిని ఒక చైనా కంపెనీ నిర్వహించేది. మాలి ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. ఇక్కడ అక్రమ మైనింగ్‌ను నియంత్రించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. జనవరిలో కూడా, దక్షిణ మాలిలోని ఒక గని వద్ద కొండచరియలు విరిగిపడి కనీసం 10 మంది మరణించారు. చాలా మంది తప్పిపోయారు. వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.

దక్షిణాఫ్రికాలో కూడా, మూసివేసిన గనులు చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దక్షిణాఫ్రికాలోని అత్యంత లోతైన గనులలో వందలాది మంది చిక్కుకున్నారు. వాస్తవానికి, ఈ గనులలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి పోలీసులు వాటికి అన్ని సామాగ్రిని నిలిపివేశారు. దీని కారణంగా ప్రజలు ఆకలి, దాహంతో చనిపోతున్నారు. జనవరిలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 78 మంది మృతదేహాలను బయటకు తీశారు. కాగా 246 మందిని సురక్షితంగా తరలించారు. బయటకు వచ్చిన వారిలో కొందరు ఆకలి కారణంగా, చనిపోయిన తమ సహచరుల శరీర భాగాలను తినవలసి వచ్చిందని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, మాలి జనాభాలో 2 మిలియన్లు అంటే 10శాతం కన్నా ఎక్కువ మంది మైనింగ్ రంగంపైనే ఆధారపడి ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో గనుల ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..