Video: పాక్ అంటే అట్లుంటది మరీ… చైనా కాల్ సెంటర్ ను లూటీ చేసిన స్థానికులు
ఇస్లామాబాద్ సెక్టార్ F-11లోని ఓ కాల్ సెంటర్‌లో స్కామ్ బయటపడటంతో స్థానికులు లూటీ చేశారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నిఘా సంస్థల దాడితో భారీ స్కామ్ వెలుగు చూసింది. దీంతో ఆ కాల్ సెంటర్‌లోకి చొరబడిన యువకులు లూటీకి తెగబడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యువకుల గుంపులు కాల్‌సెంటర్ ప్రాంగణంలోకి చొరబడి సాంకేతిక పరికరాలతో

ఇస్లామాబాద్ సెక్టార్ F-11లోని ఓ కాల్ సెంటర్‌లో స్కామ్ బయటపడటంతో స్థానికులు లూటీ చేశారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరియు నిఘా సంస్థల దాడితో భారీ స్కామ్ వెలుగు చూసింది. దీంతో ఆ కాల్ సెంటర్‌లోకి చొరబడిన యువకులు లూటీకి తెగబడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం యువకుల గుంపులు కాల్‌సెంటర్ ప్రాంగణంలోకి చొరబడి సాంకేతిక పరికరాలతో పారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాల్‌సెంటర్ ద్వారా అంతర్జాతీయ మోసాలకు పాల్పడినట్లు FIA సైబర్ క్రైమ్ సెల్ ఆపరేషన్ తో వెలుగులోకి వచ్చింది. మార్చి 15 శనివారం FIA సైబర్ క్రైమ్ సెల్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ తర్వాత 24 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడిలో కొంతమంది అనుమానితులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వ్యక్తులను FIA కార్యాలయానికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
కాల్ సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలపూ కొంత కాలంగా అధికారులు నిఘా పెట్టారు. కానీ చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారుల ఆమోదం కోసం వేచి ఉన్నానని FIA వర్గాలు స్పష్టం చేశాయి. కొంత మంది పాకిస్తాన్ వ్యక్తులను సిబ్బందిగా నియమించుకుని మోసపూరిత పథకాల ద్వారా వివిధ దేశాలలో అమాయకులను మోసం చేసినట్ల గుర్తించారు.
వీడియో చూడండి
Pakistanis have looted the Chinese Call centres in Islamabad….laptops, TV & other items all looted 😂
Note: This happened in holy month of Ramzan. pic.twitter.com/dlb2vKOKPh
— Incognito (@Incognito_qfs) March 17, 2025
అయితే అనుమానితులను పట్టుకోవడంలో FIA అధికారులు సఫలం అయినప్పటికీ ఈ దాడి త్వరగా గందరగోళం ఏర్పడింది. దాడి తర్వాత కాల్‌సెంటర్‌కు భద్రత కల్పించడంలో విఫలం అయ్యారు. దీంతో స్థానికులు ఆవరణలోకి చొరబడి విలువైన పరికరాలను ఎత్తుకుపోయారు. హార్డ్‌వేర్ పరికరాలను స్థానికులు ఎత్తుకెళుతున్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాల్‌సెంటర్ వెలుపల జనం గుమిగూడి చూస్తున్నారు. కొంతమంది విదేశీయులు కూడా అక్కడి నుండి పారిపోతుండటం వీడియోల్లో కనిపిస్తోంది.