AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi- Trump: ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చేరిన ప్రధాని మోడీ.. మొదటి పోస్ట్ ఏం పెట్టారంటే?

ప్రస్తుతం ప్రపంచంలోని బలమైన నాయకుల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ముందు వరుసలో ఉంటారు. కొన్ని విషయాల్లో వీరిద్దరి మధ్య పాలనా పరమైన వైరుధ్యాలున్నాయి. అయితేనేం ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.

PM Modi- Trump: ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చేరిన ప్రధాని మోడీ.. మొదటి పోస్ట్ ఏం పెట్టారంటే?
PM Narendra Modi, Donald Trump
Basha Shek
|

Updated on: Mar 17, 2025 | 9:15 PM

Share

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. మొదట ఏఐ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఇంటర్వ్యూను డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్రూత్ సోషల్ లో పంచుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్ వర్క్ లో చేరారు. అనంతరం తన మొదటి ట్రూత్ (నెట్ వర్క్ పోస్ట్) ఇలా రాసుకొచ్చారు ‘ట్రూత్ సోషల్‌లో చేరినందుకు ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఉద్వేగభరితమైన, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పోస్ట్ పెట్టారు ప్రధాని మోడీ. ఇదే సందర్భంగా తన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూను పంచుకున్నందుకు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘నా మిత్రుడు, అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు ధన్యవాదాలు. నా జీవిత ప్రయాణం, భారతదేశ నాగరికత దృక్పథం, ప్రపంచ సమస్యలు, మరిన్నింటితో సహా విస్తృత శ్రేణి అంశాలను నేను ఇక్కడ చర్చించాను’ అని ట్రంప్ ఇంటర్వ్యూను పంచుకున్న పోస్ట్‌కు ప్రధాని బదులిచ్చారు.

అంతకు ముందు లెక్స్‌ ఫ్రిడ్‌మాన్‌ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్‌ పాలన, ఆయనతో స్నేహం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పరస్పర విశ్వాసం అనే బంధాన్ని పంచుకున్నాను. మా ఇద్దరికీ జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఇదే సర్వోన్నతమమని మేమిద్దరం భావిస్తాం. అందుకేనేమో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం, అనుబంధం కొనసాగుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మదిలో అమెరికా అభివృద్ధిపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ఉంది. ట్రంప్ పై కాల్పులు జరిగిన సమయంలోనూ నేను ఆయనలో హుషారు, దృఢసంకల్పం చూశాను’ అని ట్రంప్ గురించి చెప్పారు మోడీ.

ప్రధాని మోడీ ఫస్ట్ పోస్ట్..

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి