PM Modi: ‘ఆర్డర్‌ ఆఫ్‌ది నైల్‌’ తో సహా ఇప్పటివరకు ప్రధాని మోడీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలివే..

|

Jun 25, 2023 | 3:40 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అత్యున్నత గౌరవం అందుకున్నారు. ఈజిప్టు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే 'ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌' పురస్కారాన్ని మోడీ అందుకున్నారు. ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలోనే ఉన్న నరేంద్ర మోడీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు.

PM Modi: ఆర్డర్‌ ఆఫ్‌ది నైల్‌ తో సహా ఇప్పటివరకు ప్రధాని మోడీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలివే..
Pm Narendra Modi
Follow us on

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అత్యున్నత గౌరవం అందుకున్నారు. ఈజిప్టు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ పురస్కారాన్ని మోడీ అందుకున్నారు. ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలోనే ఉన్న నరేంద్ర మోడీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. కాగా గత 9 ఏళ్లలో ప్రధాని మోడీ పలు అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేస్తున్న కృషికి గుర్తింపుగా పలు దేశాలు ఈ పురస్కారాలను అందించాయి. మరి తాజా ఈజిప్టు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ తో పాటు ఇప్పటివరకు మోడీ అందుకున్న ప్రతిష్ఠాత్మక పురస్కారాలేంటో తెలుసుకుందాం రండి.

కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు:
పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు కృషి చేసినందుకు, అలాగే గ్లోబల్ సౌత్ కు నాయకత్వం వహించినందుకు గానూ పాపువా న్యూ గినియా మోడీకి ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ ఏడాది మేలో ప్రధాని ఈ పురస్కారం అందుకున్నారు.

కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ:
అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ లీడర్‌గా ప్రధాని మోడీ చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది. ఈ ఏడాది మే 22న ఫిజీ ప్రధాని సితివెని రాబుకా చేతుల మీదుగా ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి’ మెడల్ అందుకున్నారు మోడీ.

ఇవి కూడా చదవండి

రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ‘ఎబాకల్‌’ అవార్డు:
ఈ ఏడాది మేలో పపువా న్యూ గినియాలో పర్యటించారు మోడీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ కృషికి గుర్తింపుగా రిపబ్లిక్ ఆఫ్ పలావు ప్రెసిడెంట్ సురాంగెల్ ఎస్. విప్స్, జూనియర్ ఎబకల్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు.

ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో:
భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోడీని డిసెంబర్ 2021లో ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ అవార్డుతో సత్కరించింది.

లెజియన్‌ ఆఫ్‌ ది మెరిట్‌ (అమెరికా):
అమెరికా సైన్యం అందించే అత్యుత్తమ పురస్కారం ఇది. భారత్‌- అమెరికాల స్నేహబంధానికి గుర్తుగా 2020 డిసెంబర్‌ 22లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతుల మీదుగా లెజియన్‌ ఆఫ్‌ ది మెరిట్‌ అవార్డు అందుకున్నారు ప్రధాని మోడీ.

ఇవి కూడా..

  • ది మోస్ట్ హానరబుల్ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్- మాల్టీవులు – జూన్‌, 2019
  • ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు- రష్యా – 2019
  • ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు- యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌- 2019
  • గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు- పాలస్తీనా- 2018
  • స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ – ఆఫ్గనిస్తాన్‌- 2016
  • ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్- సౌదీ అరేబియా- 2016

ప్రముఖ ఆర్గనైజేషన్లు, ఫౌండేషన్లు ప్రదానం చేసిన పురస్కారాలివే

  • గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు- కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ (CERA)- 2021
  • గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ అవార్డు- మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌- 2019
  • ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు- ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం- 2018
  • సియోల్ శాంతి బహుమతి- 2018