- Telugu News Photo Gallery World photos PM Modi visits 11th century Al Hakim Mosque in Egypt and see Photos
PM Modi Egypt Visit: వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత అల్ హకీం మసీదును సందర్శించిన ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన..
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టుకు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రదేశాలను సందర్శించారు.
Updated on: Jun 25, 2023 | 4:19 PM

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఈజిప్టు రాజధాని కైరోకు చేరుకున్నారు. రెండు రోజులలో భాగంగా ప్రధాని మోదీ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని ముస్తాఫా మద్‌బౌలి స్వయంగా వచ్చ ఘన స్వాగతం పలికారు.

ఈజిప్టు రాజధాని కైరోలో గార్డులు ప్రధాని మోదీకి గౌరవ వందనం చేశారు. ఈ పర్యటన ఈజిప్టుతో బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న నమ్మకం నాకుందని.. తనకు స్వాగతం పలికిన ఈజిప్టు ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టులో ఎంతో ప్రతిష్ఠ్మాక అవార్డు'ఆర్డర్ ఆఫ్ ది నైలు'ను ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా చేశారు.

ప్రధాని మోదీ తన ఈజిప్టు పర్యటనలో రెండో రోజైన ఆదివారం (జూన్ 25) అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈ మసీదు ఈజిప్టు రాజధాని కైరోలో ఉంది.

భారత సంతతికి చెందిన బోహ్రా కమ్యూనిటీ సభ్యుడు షుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఈజిప్టు ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని.. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అల్-హకీమ్ మసీదు వద్ద) ఇక్కడకు వచ్చి మాతో మాట్లాడారు. అతను మా బోహ్రా కమ్యూనిటీ శ్రేయస్సు గురించి కూడా ఆరా తీశారు. ప్రధాని మోదీ మా కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నాం.. అని తెలిపారు.

అల్- హకీం- మసీదు వద్ద ప్రధాని మోదీకి భారీ ఎత్తున ఈజిప్టు ప్రజలు స్వాగతం పలికారు.

11వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ పనులను దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు మోదీకి వివరించారు.

దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును కూడా ప్రధాని మోదీ ఆదివారం సందర్శించిన సమయంలో ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు ఈజిస్ట్ ప్రజలకు క్యూ కట్టారు. ఫాతిమిడ్ రాజవంశం పాలనలో ఈ మసీదు నిర్మించారు.





























