- Telugu News Photo Gallery Dracula horseflies can bite through clothes and tear flesh apart expert warned all you need to know full details
Dracula Horseflies: మానవాళికి ముప్పుగా మారిన గుర్రపు ఈగలు.. రక్తం తాగే ఈగ కరిస్తే ఇక అంతే..
డ్రాక్యులా హార్స్‌ఫ్లైస్ లేదా గుర్రపు ఈగలు మానవాళికి ముప్పుగా మారాయని.. ఇవి అనేకరకాల అంటు వ్యాధులను వ్యాప్తి చేసే ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వ్యాప్తిని అరికట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.. రోజు రోజుకీ పెరుగున్న ప్రమాదం గురించి శాస్త్రజ్ఞులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Updated on: Jun 25, 2023 | 2:19 PM

ప్రపంచంలోని అనేక దేశాలలో డ్రాక్యులా ఫ్లై అంటే గుర్రం ఈగల భీభత్సం పెరుగుతోంది. వీటిని నివారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశేషమేమిటంటే.. మందపాటి దుస్తులు ధరించినప్పటికీ, అవి మనిషిని గాయపరుస్తాయి. మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. కీటకాలను తరిమికొట్టే రసాయనాలు కూడా ఈ గుర్రపు ఈగలపై పని చేయడం లేదు. ఈ ఈగల వలన అనేక తీవ్రమైన అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటి వలన ప్రమాదం ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

DailyMail నివేదిక ప్రకారం బ్రిటన్‌తో సహా మధ్యధరా దేశాలలో ఈ గుర్రం ఈగల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. వీటి సంఖ్య పెరగడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. వాస్తవానికి బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో వేడి వేసవి తర్వాత ఆకస్మిక వర్శలు ఈ గుర్రపు ఈగల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణంగా మారింది. ఫలితంగా ఈ రక్తం పీల్చే ఈగల సంఖ్య పెరిగింది. దీంతో అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగింది

గుర్రపు ఈగలు ఎందుకు ప్రమాదకరమో నిపుణులు చెప్పిన విషయానికి వెళ్తే.. ఆడ గుర్రపు ఈగలు మానవులపై వాలి.. శరీరం నుండి రక్తాన్ని పీల్చుకుంటాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అది కరిచిన ప్రదేశంలో వాపు వస్తుంది. తీవ్రమైన నొప్పిని కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్‌తో కూడా ఈ ఈగతో వ్యాపించిన వ్యాధికి చికిత్స సాధ్యం కాదు. ఇతర కీటకాల కాటుతో పోలిస్తే, ఈ ఈగలు చేసిన గాయాలు లేదా వాపులు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది

ఈ గుర్రపు ఈగ బాధితురాలు ఆలిస్ డువాల్ మాట్లాడుతూ అసలు ఈ ఈగలు కందిరీగ లేదా తేనెటీగ లు చేసే విధంగా ఎటువంటి శబ్దాలు చేయవని తెలిపింది. అంతేకాదు ఇవి కరిచిన చోట పెద్ద ఎర్రటి మచ్చ ఏర్పడిందని.. వెంటనే ఉబ్బిపోయింది. భరించలేని బాధ ఏర్పడిందని పేర్కొంది.

UK యాంటీబయాటిక్ రీసెర్చ్ సెంటర్ గత కొంత కాలంగా ఈ గుర్రపు ఈగల సంఖ్య వేగంగా పెరిగిందని తెలిపింది. కనుక ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కొత్త యాంటీబయాటిక్ ఔషధం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఈ గుర్రపు ఆడ ఈగలు రక్తపిపాసి కీటకాలని ..మన శరీరంలోని రక్తాన్ని మాత్రమే కాదు జంతువుల రక్తాన్ని పీలుస్తాయని బ్రిటిష్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్ చెబుతోంది. అందుకనే వీటిని రక్త పిపాసి ఈగలని అంటారు.

ఎవరైనా ఈ గుర్రపు ఈగలు కరిస్తే.. ముందుగా అలా కరిచిన భాగాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేయాలి. తర్వాత మంచు ముక్కతో రుద్దండి. అయితే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఈగ కరిచిన చోట గోక వద్దు. ఎలాంటి హోం రెమెడీస్‌ను అప్లై చేయవద్దు అంటూ బ్రిటిష్ హెల్త్ ఏజెన్సీ NHS చెప్పింది. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించమని సూచించింది.





























