Layoffs: అమెరికాలో భారతీయుల అవస్థలు.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు గయాబ్..

అమెరికాలో లేఆఫ్స్‌తో అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది వాళ్ల పరిస్థితి. ఉద్యోగాల కోత ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా ఉంది.

Layoffs: అమెరికాలో భారతీయుల అవస్థలు.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు గయాబ్..
Us Indians
Follow us

|

Updated on: Jan 23, 2023 | 9:27 PM

అమెరికాలో లేఆఫ్స్‌తో అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది వాళ్ల పరిస్థితి. ఉద్యోగాల కోత ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా ఉంది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల మంది ఐటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ లాంటి సంస్థల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో 30 నుంచి 40 శాతం వరకు భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 80 వేల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయినట్టు అంచనా.

లేఆఫ్స్‌ కారణంగా హెచ్‌-1బీ, ఎల్‍ 1 వీసాలపై ఉన్నవాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ నిపుణులకు హెచ్-1బీ వీసాలను అమెరికా కంపెనీలు జారీ చేస్తుంటాయి. అలాగే ఎల్-1ఏ, ఎల్-1బీ వీసాలను మేనేజర్, స్పెషన్ కేటగిరీలకు టెంపరరీ ఇంట్రాకంపెనీ ట్రాన్స్‌ఫరీస్‌లకు అందిస్తుంటాయి. హెచ్‌-1బీ, ఎల్‍ 1 వీసాలపై వచ్చిన వాళ్లు ఉద్యోగాలు కోల్పోతే రెండు నెలల్లో కొత్త ఉద్యోగం సాధించాలి. లేదంటే స్వదేశానికి తిరిగి రావల్సిందే.

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన తరువాత చాలామంది భారత్‌ నుంచి అమెరికాకు హెచ్‌ 1బీ, ఎల్‍ 1 వీసాలపై వెళ్తుంటారు. కాని లేఆఫ్స్‌ సీజన్‌ వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గూగుల్‌ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో జాబ్ పొగొట్టుకున్న వేలాది మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ తమకు ఉన్న కొద్ది సమయంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం పోయిన క్రమంలో వర్క్ వీసాల గడువు ముగుస్తుంది. దీంతో కొత్త జాబ్ వెతుక్కుని అక్కడే ఉండాలనుకుంటున్న వారి పరిస్థితి దారుణంగా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నాన్ ఇమ్మిగ్రాంట్ వర్క్ వీసాలైన హెచ్-1బీ, ఎల్1 వీసాలపై ఉన్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు విదేశీ వర్క్ వీసాలు పొందడం, వారి వీసాల స్టేటస్ మార్చుకోవడం కోసం కొద్ది నెలల సమయం ఉంటుంది. అందుకు వీలైనంత తర్వలో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది.

ఆర్ధికమాంద్యం కారణంగా ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగాల కోతకే మొగ్గు చూపుతున్నాయి. కొత్త వారిని తీసుకునే పరిస్థితులు లేవు. దీంతో 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..