AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: స్ట్రిప్ క్లబ్‌కు తీసుకెళ్లమన్న ప్రియురాలు.. కాదన్న ప్రియుడు.. కట్ చేస్తే.. దెబ్బకు మైండ్ బ్లాంక్!

గొడవలు అనేవి లేకుండా ఎలాంటి బంధం ఉండదు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే.. పెద్ద వాగ్వాదానికి దారి తీసి..

Viral: స్ట్రిప్ క్లబ్‌కు తీసుకెళ్లమన్న ప్రియురాలు.. కాదన్న ప్రియుడు.. కట్ చేస్తే.. దెబ్బకు మైండ్ బ్లాంక్!
Strip Club
Ravi Kiran
|

Updated on: Jan 23, 2023 | 8:58 PM

Share

గొడవలు అనేవి లేకుండా ఎలాంటి బంధం ఉండదు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలే.. పెద్ద వాగ్వాదానికి దారి తీసి.. చివరికి విషాదకరమైన ఎండింగ్‌తో పూర్తవుతాయి. అలాగే చిన్న కారణాలతోనే ఎన్నో బంధాలు విచ్చిన్నమైపోయాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటిదే ఒకటి జరిగింది. తన ప్రియుడితో కలిసి లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ యువతి చిన్న గొడవకు విపరీతమైన కోపాన్ని తెచ్చుకుని చేయకూడదని పని చేసింది.. చివరికి జైలు పాలయ్యింది.

మియామి హెరాల్డ్(Miami Herald) నివేదిక ప్రకారం, 61 ఏళ్ల ఎలిజిబెత్ అన్నా షెర్లాక్ మాసన్, 69 ఏళ్ల విత్‌హెల్డ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఒక రోజు ఈవెనింగ్ సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో అది కాస్తా సీన్ రివర్స్ అయింది. ముందుగా ఎలిజిబెత్ ‘లుకర్స్'(Lookers) అనే స్ట్రిప్ క్లబ్‌కు వెళ్దామనుకుంది. అందుకు మొండిపట్టు పట్టింది. అయితే ఆమె ప్రియుడు మాత్రం ముందుగా తనకు ఇష్టమైన హ్యాంగ్‌అవుట్‌కి వెళ్లాలని చెప్పాడు. దీనికి ఇష్టం లేకపోయినా ఎలిజిబెత్ చివరికి అంగీకరించింది.

ఆ ఇద్దరూ అతడికి ఇష్టమైన హ్యంగ్‌ఔట్ ప్లేస్‌కు వెళ్లారు. అక్కడ ఎలిజిబెత్ ఫుల్‌గా మద్యం సేవించి.. ప్రియుడ్ని దుర్భాషలాడటం మొదలుపెట్టింది. అంతేకాదు.. అతడి గొంతు పట్టుకుని నులుమేందుకు యత్నించింది. ఆమె నుంచి తప్పించుకునేందుకు విత్‌హెల్డ్ ఎంతగానో ప్రయత్నించగా.. ఎలిజిబెత్ మాత్రం గట్టిగా అతడి ప్రైవేటు పార్ట్‌పై బలంగా తన్నింది.

కాగా, ఆమె నుంచి ఎలాగోలా చివరికి తప్పించుకున్న విత్‌హెల్డ్.. 911 నెంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. రంగంలోకి దిగిన ఖాకీలు ఆమెను అదుపులోకి తీసుకుని.. జైలుకు తరలించారు. ఫుల్‌గా మద్యం సేవించి ఉండటంతో ఎలిజిబెత్ ఈమేరకు ప్రవర్తించిందని.. అలాగే ప్రియుడ్ని చంపాలని చూసిందని లీ కౌంటీ పోలీసులు తెలిపారు.