Apple Watch: గర్భిణీ ప్రాణాలను కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలుసా?
ఈ మధ్య కాలంలో కెల్లీ నిద్రపోతున్న సమయంలో హార్ట్‌రేట్ ఎక్కువగా ఉంటోందని , ఆ నోటిఫికేషన్‌లోని సారాంశం. అంతకుముందు నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేదని, కానీ.. అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ మెస్సేజ్ ఇచ్చింది.

మార్కెట్‌లో కొత్తగా వచ్చిన యాపిల్ వాచ్ అదరగొడుతోంది. న్యూ ఫీచర్స్‌తో ఓ మహిళకు తను గర్భవతి అని తెలుసుకున్న ఘటన అమెరికాలో వెలుగుచూసింది. ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎంఎస్ కెల్లీ అనే మహిళ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన భర్తతో కలిసి నివాసముంటున్నారు. తన చేతికి యాపిల్ వాచ్ ఉంటుంది. అయితే తాజాగా ఈ యాపిల్ వాచ్ వల్ల తను గర్భవతిని అని తెలుసుకుని మురిసిపోయిందామె. కెల్లీకి యాపిల్ వాచ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. వాచ్‌లో టైమ్ చూస్తుండగా ఆమెకు ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఈ మధ్య కాలంలో కెల్లీ నిద్రపోతున్న సమయంలో హార్ట్‌రేట్ ఎక్కువగా ఉంటోందని , ఆ నోటిఫికేషన్‌లోని సారాంశం. అంతకుముందు నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేదని, కానీ.. అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ మెస్సేజ్ ఇచ్చింది. ఇది చిన్న మార్పే కానీ.. ఇలా గత 15 రోజులుగా జరుగుతోందని ఆ నోటిఫికేషన్‌లో ఉన్నట్లు ఆమెకు తెలిసింది. దీంతో అనుమానం వచ్చి ఎంఎస్ కెల్లీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే గర్భవతి అని తెలిసింది. తన కన్నా ముందే యాపిల్ వాచ్‌కు ఈ వార్త తెలిసిపోయిందని ఆమె పేర్కొంది. ఒకవేళ ఈ వాచ్ లేకపోతే తనకు అసలు అనుమానమే వచ్చేది కాదని కెల్లీ చెబుతోంది.
కాగా కొత్తగా యాపిల్ కంపెనీ విడుదల యాపిల్‌వాచ్‌లలో సరికొత్త ఫీచర్లను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ముఖ్యంగా యూజర్ల ఆరోగ్యంపై ఈసారి యాపిల్ కంపెనీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హార్ట్ బీట్ మానిటర్, టెంపరేచర్ సెన్సార్ వంటి వాటిని ఈ వాచ్‌లలో పొందుపరిచింది. ఈ ఘటనలోనే కాకుండా మరో ఘటనలో యాపిల్ వాచ్ హార్ట్ బ్లాకేజ్ గుర్తించి ఒక మహిళ జీవితాన్ని కాపాడింది. అలానే క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో యాపిల్ వాచ్ 8 సిరీస్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కాపాడింది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..