స్థానిక కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ తరపున వాదించడానికి పవర్ ఆఫ్ అటార్నీని సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష న్యాయవాదులు ఆయనను చుట్టుముట్టారు. బెదిరించి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు చిన్మోయ్ కృష్ణ దాస్ కేసు విచారణ నెల రోజులు వాయిదా వేశారు. దీంతో చిన్మోయ్ భద్రతపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ కేసు మంగళవారం బంగ్లాదేశ్ కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టు తీర్పుపై యావత్ ప్రపంచం ఎదురుచూసింది. అయితే చిన్మోయ్ కృష్ణ తరపున న్యాయవాదిగా ఎవరూ హాజరు కాలేదని సమాచారం. దీంతో విచారణను నెల రోజుల పాటు వాయిదా వేశారు. అయితే రోజులు గడిచేకొద్దీ.. ఒక భయంకరమైన వాస్తవం బయటపడింది. చిన్మోయ్ కృష్ణ తరపున కోర్టుకు ఎవరైనా లాయర్లు హాజరైతే వారిని కొడతామని లాయర్లను బెదిరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చేయవలసి వచ్చింది.
సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవర్ ఆఫ్ అటార్నీని సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష న్యాయవాదులు ఆయనను చుట్టుముట్టారు. నిత్యం బెదిరించి చిత్రహింసలకు గురిచేశారు. న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ కేసుని ఎవరైనా తీసుకున్నా.. లేదా కోర్టులో వాదించినా చిన్మోయ్ కృష్ణ దాస్‌ను హత్య చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపుల ప్రభావం చిన్మోయ్ కృష్ణ దాస్ లాయర్ పై పడింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మరికొందరు లాయర్లు భయపడి ఫోన్ ఎత్తడం లేదు. అందరూ మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..