AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరిగిన విభేదాలు, భర్త కాన్యేవెస్ట్ తో విడాకులు కోరిన అమెరికన్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్

వారి పచ్చని కాపురంలో చిచ్చు రేగింది. ర్యాపర్ కూడా అయిన తన భర్త కాన్యే వెస్ట్ తో అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ విడాకులు కోరుతూ దరఖాస్తు చేసింది. తన లాయర్… లారా వాసర్ ద్వారా శుక్రవారం ఆమె అతనికి డైవోర్స్ నోటీసు పంపింది. కాన్యే కూడా ఈమె నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపినట్టు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. ఆ మధ్య అమెరికా  అధ్యక్ష ఎన్నికలకు ముందు తాను […]

పెరిగిన విభేదాలు, భర్త కాన్యేవెస్ట్ తో విడాకులు కోరిన అమెరికన్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 20, 2021 | 6:12 PM

Share

వారి పచ్చని కాపురంలో చిచ్చు రేగింది. ర్యాపర్ కూడా అయిన తన భర్త కాన్యే వెస్ట్ తో అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ విడాకులు కోరుతూ దరఖాస్తు చేసింది. తన లాయర్… లారా వాసర్ ద్వారా శుక్రవారం ఆమె అతనికి డైవోర్స్ నోటీసు పంపింది. కాన్యే కూడా ఈమె నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపినట్టు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. ఆ మధ్య అమెరికా  అధ్యక్ష ఎన్నికలకు ముందు తాను కూడా రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కాన్యే హడావుడి చేశాడు. దాంతో అతని మానసిక స్థితిపై పలువార్తలు వచ్చాయి. అప్పుడే అతనికి కర్దాషియన్ డైవోర్స్ ఇవ్వవచ్చునని ఊహాగానాలు రేగినప్పటికీ..ఆమె వాటిని కొట్టి పారేసింది. అలాంటి యోచన లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ రోజురోజుకీ వీరిమధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, లీగల్ గా విడిపోవాలని నిశ్చయించుకున్నారని తాజాగా తెలుస్తోంది.  కాన్యేకి డైవోర్స్ ఇస్తున్నందుకు తనకు విచారంగా ఉందని, అదే సమయంలో ఈ ప్రక్రియ  ప్రొసీడింగ్స్ తో కాస్త ఉపశమనం పొందుతున్నానని కూడా కర్దాషియన్ పేర్కొంది. kim kardashian files for divorce from kanyewest, us reality tv star kim kardashian, divorce, rapper, husband kanyewest, differences, divorce proceedings, kanyewest mental health,kim kardashian files for divorce from kanyewest, us reality tv star kim kardashian, divorce, rapper, husband kanyewest, differences, divorce proceedings, kanyewest mental health,ఎంతో ఆలోచించిన అనంతరమే..చివరకు అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఈమె తెలిపింది. అయితే పిల్లల విషయంలో వారి  జాయింట్ కస్టడీ ఏర్పాటుకు కాన్యే మానసిక స్థితి అడ్డంకి కాబోదని అంటున్నారు. కిమ్ కర్దాషియన్, కాన్యే ఎప్పుడు విడిపోతారన్నది తెలియడంలేదు. తమ నలుగురు పిల్లలకు  లీగల్, ఫిజికల్ కస్టడీ ముఖ్యంగా తనకు కావాలని కర్దాషియన్ కోరుతోంది. ఏమైనా…. ఈ పిల్లలు ఈమె వద్దే ఉంటారని, కాన్యే వెస్ట్ తాను ఎప్పడు కోరినా వారిని విజిట్ చేయవచ్చునని అంటున్నారు. kim kardashian files for divorce from kanyewest, us reality tv star kim kardashian, divorce, rapper, husband kanyewest, differences, divorce proceedings, kanyewest mental health,