తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత మద్దతు.. కాబూల్ చేరుకున్న తాలిబన్ కో-ఫౌండర్

| Edited By: Phani CH

Aug 22, 2021 | 7:36 PM

తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత ఒకరు మద్దతు ప్రకటించారు. నంగార్హర్ మాజీ గవర్నర్. ఆఫ్ఘన్ రాజకీయాలతో చిరకాలంగా సంబంధం ఉన్న మహమ్మద్ షఫీక్ గుర్ అఘా షెర్జాయ్ తన సపోర్టు తాలిబన్లకేనని ప్రకటించారు.

తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత మద్దతు.. కాబూల్ చేరుకున్న తాలిబన్ కో-ఫౌండర్
Afghanistan Politicians
Follow us on

తాలిబాన్లకు సీనియర్ ఆఫ్ఘన్ రాజకీయ నేత ఒకరు మద్దతు ప్రకటించారు. నంగార్హర్ మాజీ గవర్నర్. ఆఫ్ఘన్ రాజకీయాలతో చిరకాలంగా సంబంధం ఉన్న మహమ్మద్ షఫీక్ గుర్ అఘా షెర్జాయ్ తన సపోర్టు తాలిబన్లకేనని ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్ లోని ఆస్వాకా న్యూస్ తన ట్విట్టర్లో ఈ వార్త తాలూకు వీడియోను షేర్ చేసింది. తాలిబన్ నేతల సమక్షంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించినట్టు పేర్కొంది. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హాష్మత్ ఘని అహ్మద్ జాయ్ తన మద్దతు తాలిబన్లకే అని ప్రకటించిన మరునాడే ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఆయన బాహాటంగా తన వైఖరి ప్రకటించకపోయినా.. దేశంలో శాంతి, సుస్థిరత నెలకొనాలంటే ఇందుకు వారే సమర్ధులని, విద్యా వంతులైన యువ సభ్యుల సహకారం ప్రభుత్వానికి అవసరమని ట్వీట్ చేశారు.కాలం చెల్లిన రాజకీయ నేతలను పక్కన బెట్టాలనితద్వారా విఫలమైన సంకీర్ణ నాయకత్వ ప్రభుత్వం మళ్ళీ అధికారం లోకి రాజాలదని ఆయన అన్నారు.

ఇలా ఉండగా తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ శనివారం కాబూల్ చేరుకున్నారు. జిహాదీ నేతలతో ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించనున్నారు. అన్ని పక్షాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని పాకిస్థాన్ కూడా తాలిబాన్లకు సూచించింది.


మరిన్ని ఇక్కడ చూడండి: వావ్ ! దాల్ సరస్సులోని హౌస్ బోట్ లో ‘ఫ్లోటింగ్ ఏటీఎం’ ! చూడాల్సిందే !

RGV: గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ