Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఓ చారిత్రాత్మిక మైలురాయి: జ్యోతిరాదిత్య సింధియా

మొట్టమొదటిసారిగా స్టట్‌గార్ట్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో టీవీ9 నెట్‌వర్క్ ఈ తరహ కార్యక్రమం ఒకటి నిర్వహించడం చారిత్రాత్మకం అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు.

జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఓ చారిత్రాత్మిక మైలురాయి: జ్యోతిరాదిత్య సింధియా
Jyothiradhitya Scindia
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 22, 2024 | 1:36 PM

మొట్టమొదటిసారిగా స్టట్‌గార్ట్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో టీవీ9 నెట్‌వర్క్ ఈ తరహ కార్యక్రమం ఒకటి నిర్వహించడం చారిత్రాత్మకం అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. క్రీడలు కేవలం ఆట మాత్రమే కాదు.. ఓ జట్టు నిర్మాణం అవుతుంది, భాగస్వామ్యాలు సైతం ఏర్పడతాయి. అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతాయని మంత్రి అన్నారు.

భారతదేశం, జర్మనీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జర్మనీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌కు పెట్టింది పేరు. దీనిని స్టట్‌గార్ట్‌లో చూస్తున్నాం. పోర్షే, మెర్సిడెస్ బెంజ్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. భారతదేశం కూడా ఈ సూత్రాన్ని అనుసరిస్తోంది. భారతదేశ జనాభాలో 70 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. భారత్, జర్మనీలు తమ బంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

గత 10 ఏళ్లలో భారతదేశం ఎంతగానో రూపాంతరం చెందింది. 1920లో జర్మనీలో భారతీయ కమ్యూనిటీకి చెందిన కొన్ని వందల మంది ఉన్నారని, నేడు వారి సంఖ్య లక్షలకు చేరుకుందని చెప్పారు. భారతీయులమైన మనం మన సత్తాను ప్రపంచానికి చూపిస్తున్నామని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారతదేశ సామర్థ్యం, జర్మనీ నైపుణ్యం కలిసి ప్రపంచానికి కొత్త ఉదాహరణను అందించగలవు. నేడు జర్మనీలో 50 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, దీనివల్ల భారత్, జర్మనీల మధ్య బంధం బలపడుతుందన్నారు కేంద్రమంత్రి. దీనికి కారణం భారతదేశంలోని 4 స్తంభాలు. అవే ప్రజాస్వామ్యం, జనాభా, డేటా, డిమాండ్.

ప్రధాని మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందింది. గత 6 దశాబ్దాల్లో భారత్ సాధించలేనిదంతా సాధించింది. టెలికాం గురించి మాట్లాడినట్లయితే, ఒక దశాబ్దంలో, ఇంటర్నెట్ వినియోగదారులు 250 మిలియన్ల నుంచి 970 మిలియన్లకు పెరిగారు. బ్రాడ్‌బ్యాండ్ 60 మిలియన్ల వినియోగదారుల నుంచి 924 మిలియన్ల వినియోగదారులకు పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 1.16 బిలియన్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

సింధియా మాట్లాడుతూ, రవీంద్రనాథ్ ఠాగూర్ జర్మనీకి చాలాసార్లు వెళ్ళారు. భారతదేశంలోని శాంతినికేతన్‌ను సందర్శించాల్సిందిగా ఆయన ఇక్కడి ఆలోచనాపరులను, తత్వవేత్తలను ఆహ్వానించారు. భారతదేశం, జర్మనీ మధ్య ఆలోచనలు, సాహిత్యం, ఆవిష్కరణల మార్పిడి లాంటి సంబంధాలు ఉన్నాయి. గత దశాబ్దకాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప విజయాలు సాధించింది.

మరోవైపు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రధాని మోదీ దేశంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. మొదటి సంవత్సరంలో, 1 లక్ష 25 వేల మంది విద్యార్థులకు దేశంలోని పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం లభిస్తుంది. భారత్-జర్మనీ కలిసి ప్రపంచ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని లిఖించగలవు. మనది వసుధైవ కుటుంబం (ప్రపంచం ఒకే కుటుంబం) అనే ఆలోచన ఉన్న దేశం.