AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశం వృద్దికి అవే మూలం.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో అశ్విని వైష్ణవ్ కీలక ప్రసంగం

గత 10 ఏళ్లలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న..

భారతదేశం వృద్దికి అవే మూలం.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో అశ్విని వైష్ణవ్ కీలక ప్రసంగం
Ashwini Vaishnaw
Ravi Kiran
|

Updated on: Nov 22, 2024 | 1:39 PM

Share

గత 10 ఏళ్లలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యలే ఇందుకు కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో మూడు రోజుల న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న అశ్విని వైష్ణవ్.. భారతదేశ వృద్ధికి మూలమైన నాలుగు స్తంభాల గురించి వివరించారు.

భారతదేశ వృద్ధికి నాలుగు స్తంభాలు..

భారతదేశ వృద్ధి వ్యూహం నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది. మొదటిది మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడి. రెండవది సమగ్ర ప్రగతి. మూడవది తయారీ, ఆవిష్కరణ. నాల్గవది చట్టాలను సరళీకృతం చేయడం అని కేంద్రమంత్రి అన్నారు. భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల పరంగా భారతదేశం ఎలా పురోగమించిందో మంత్రి వివరించారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని.. సమగ్ర ప్రగతి లేదా సమ్మిళిత వృద్ధి అనే అంశం గురించి మాట్లాడుతూ, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకురావడంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు.

545 మిలియన్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రజా గృహ నిర్మాణ కార్యక్రమంలో 40 లక్షల మందికి ఇళ్లు నిర్మించాం. 100 మిలియన్ల గృహాలు గ్యాస్ ఉపయోగించడం ప్రారంభించాయి. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం 350 మిలియన్ల మందికి వర్తిస్తుంది. 70 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఉచిత కవరేజీ అందుతోంది. పదేళ్లలో 250 మిలియన్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారు. మరే దేశంలోనూ ఇలాంటివి జరగలేదన్నారు అశ్విని వైష్ణవ్.

స్మార్ట్‌ఫోన్ల తయారీ గణనీయంగా పెరుగుతోంది. సెమీకండక్టర్ రంగం దేశంలో ప్రారంభమైందని వివరిస్తూ.. తయారీ, ఆవిష్కరణలలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతోందో ఇవి ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వలస పాలనలో మిగిలిపోయిన చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించిందని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలలో మనం మూడు ప్రధాన సంఘటనలను చూశాం. కోవిడ్ పరిస్థితిని చూశాం. 60 దేశాలు ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికలు కూడా నిర్వహించాం. 800 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది మానవ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఓటు. బీజేపీ వరుసగా మూడుసార్లు ఎన్నికైంది. ఆరు దశాబ్దాల తర్వాత వరుసగా మూడోసారి ఎన్నికవడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే ఇందుకు కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో వెల్లడించారు.