పరిహారం కేసులో గెలిచిన హాలీవుడ్ నటీ..కోరినట్లుగానే డాలర్ చెల్లింపు

|

Apr 02, 2023 | 7:15 PM

హాలీవుడ్ న‌టి గ్విన‌త్ పాల్ట్రో..ఓ పరిహారం కేసులో విజ‌యం సాధించింది. ఆమె కోరిన‌ట్లే ఒక డాల‌ర్ చెల్లించాల‌ని ప్రత్యర్థిని కోర్టు ఆదేశించింది. ఇక కేసు వివ‌రాల్లోకి వెళ్తే.. 2016లో అమెరికాలోని ఉటాహ్ రిసార్టులో ఓ ప్రమాదం జ‌రిగింది.

పరిహారం కేసులో గెలిచిన హాలీవుడ్ నటీ..కోరినట్లుగానే డాలర్ చెల్లింపు
Gwyneth Paltrow
Follow us on

హాలీవుడ్ న‌టి గ్విన‌త్ పాల్ట్రో..ఓ పరిహారం కేసులో విజ‌యం సాధించింది. ఆమె కోరిన‌ట్లే ఒక డాల‌ర్ చెల్లించాల‌ని ప్రత్యర్థిని కోర్టు ఆదేశించింది. ఇక కేసు వివ‌రాల్లోకి వెళ్తే.. 2016లో అమెరికాలోని ఉటాహ్ రిసార్టులో ఓ ప్రమాదం జ‌రిగింది. స్కీయింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌న‌ను పాల్ట్రో ఢీకొట్టిన‌ట్లు 76 ఏళ్ల డాక్టర్ టెర్రీ అండ‌ర్సన్ కేసు వేశాడు. త‌న‌కు మూడు ల‌క్షల డాల‌ర్లు చెల్లించాల‌ని ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రమాదం వ‌ల్ల త‌న ఆరోగ్యం దెబ్బతిందని అందుకే తనకు పరిహారం కావాలని కేసు పెట్టాడు.

అయితే ఈ కేసుకు కౌంట‌ర్‌గా న‌టి పాల్ట్రో కూడా కేసు వేసింది. ఆ ప్రమాదానికి కార‌ణం అండ‌ర్సన్ అని, త‌నకు పరిహారంగా ఒక డాల‌ర్ ఇవ్వాల‌ని ఆమె కోర్టులో కేసు వేసింది. అయితే గురువారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడైంది. స్కీయింగ్ ప్రమాదంలో పాల్ట్రో త‌ప్పేమీ లేద‌ని కోర్టు ఆ కేసును కొట్టిపారేసింది. పాల్ట్రోకు ఒక డాల‌ర్ పరిహారంతో పాటు లీగ‌ల్ ఫీజులు చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే లీగ‌ల్ ఫీజుల ప‌రిహారం మాత్రం వేల డాల‌ర్లలో ఉండే అవ‌కాశం ఉంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..