స్టింగ్ ఆపరేషన్ల సోగ్గాడు.. మళ్ళీ దొరికాడు!

వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేకి మళ్ళీ కష్టాలు తప్పేలా లేవు. అతడి మీదున్న రేప్ కేసు దర్యాప్తును రీఓపెన్ చేస్తున్నట్లు స్వీడన్ స్టేట్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. ఎటువంటి అభియోగాలు నమోదు కాకుండా 2017లో ఆగిపోయిన ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు మళ్ళీ పుంజుకోనుంది. ఈక్విడారియన్ ఎంబసీలో ఏడేళ్లుగా తలదాచుకున్న అసాంజేను గత నెలలోనే అరెస్ట్ చేశారు లండన్ పోలీసులు. ‘వికీ లీక్స్’ పేరుతో రహస్య డాక్యుమెంట్లను బహిరంగపరిచి నేరానికి పాల్పడ్డట్టు అభియోగం మోపిన అమెరికా కూడా అతడిని […]

స్టింగ్ ఆపరేషన్ల సోగ్గాడు.. మళ్ళీ దొరికాడు!
Pardhasaradhi Peri

|

May 13, 2019 | 7:31 PM

వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేకి మళ్ళీ కష్టాలు తప్పేలా లేవు. అతడి మీదున్న రేప్ కేసు దర్యాప్తును రీఓపెన్ చేస్తున్నట్లు స్వీడన్ స్టేట్ ప్రాసిక్యూటర్ ప్రకటించారు. ఎటువంటి అభియోగాలు నమోదు కాకుండా 2017లో ఆగిపోయిన ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు మళ్ళీ పుంజుకోనుంది. ఈక్విడారియన్ ఎంబసీలో ఏడేళ్లుగా తలదాచుకున్న అసాంజేను గత నెలలోనే అరెస్ట్ చేశారు లండన్ పోలీసులు. ‘వికీ లీక్స్’ పేరుతో రహస్య డాక్యుమెంట్లను బహిరంగపరిచి నేరానికి పాల్పడ్డట్టు అభియోగం మోపిన అమెరికా కూడా అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.

అత్యాచారం కేసులో అసాంజే చుట్టూ ఉచ్చు బిగిస్తున్న స్వీడన్ ప్రాసిక్యూటర్.. అతడిపై ‘యూరోపియన్ అరెస్ట్ వారెంట్’ జారీకి ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ఈక్విడార్ ఎంబసీకి పారిపోయినందుకు అసాంజేకి బ్రిటన్ 50 వారాల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు రేప్ కేసుని తిరగదోడాలన్న స్వీడన్ ప్రయత్నంతో అమెరికా కూడా అప్రమత్తమైంది. వైట్ హౌస్ నుంచి ‘డాక్యుమెంట్ల హాకింగ్’కి పాల్పడ్డాడన్న కేసును పైకి తీసి.. అతడిని తమకు అప్పగించాలన్న డిమాండ్ ని బ్రిటన్ ముందుంచబోతోంది అమెరికా. ఇలా అనేక దేశాల నుంచి ‘అప్పగింత’ డిమాండ్లు పోటెత్తడంతో.. అసాంజే విషయంలో బ్రిటన్ కి న్యాయపరమైన సంక్లిష్టత ఏర్పడనుంది. ఏదేమైనా.. అసాంజే భవిష్యత్తు మళ్ళీ చీకటిమయం కానుందని అక్కడి మీడియా రాసేస్తోంది. ఒకప్పుడు ‘స్టింగ్ ఆపరేషన్లకు పితామహుడు’ అంటూ అగ్రరాజ్యాన్నే వణికించిన జూలియస్ అసాంజే.. ఇప్పుడు అనేక దేశాలకు ఇలా ‘కావాల్సినవాడ’య్యాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu