Australia Titanic: 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలతో వెళ్తూ మునిగి నౌక.. 81 ఏళ్ల తరువాత అక్కడ కనిపించడంతో..

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం.. ప్రపంచమంతా యుద్ధ వాతావరణమే.. అలాంటి పరిస్థితుల్లో వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలతో వెళ్తూ మునిగిపోయిన ఓ షిప్‌ ఆచూకీని 81 ఏళ్ల తర్వాత కనుక్కున్నారు. టైటానిక్‌ కాకపోయినా..ఇది కూడా టైటానిక్‌ అంత పెద్దదే.. ఈ ఘటనలో అప్పట్లో 979 మంది జలసమాధి అయ్యారు. అందరూ ఆస్ట్రేలియన్లే..

Australia Titanic: 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలతో వెళ్తూ మునిగి నౌక.. 81 ఏళ్ల తరువాత అక్కడ కనిపించడంతో..
Japan Ship

Updated on: Apr 23, 2023 | 6:46 AM

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం.. ప్రపంచమంతా యుద్ధ వాతావరణమే.. అలాంటి పరిస్థితుల్లో వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలతో వెళ్తూ మునిగిపోయిన ఓ షిప్‌ ఆచూకీని 81 ఏళ్ల తర్వాత కనుక్కున్నారు. టైటానిక్‌ కాకపోయినా..ఇది కూడా టైటానిక్‌ అంత పెద్దదే.. ఈ ఘటనలో అప్పట్లో 979 మంది జలసమాధి అయ్యారు. అందరూ ఆస్ట్రేలియన్లే.. వీరితో పాటు..14 దేశాలకు చెందిన మొత్తం 1080 మంది సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇంతకీ ఇప్పుడెలా బయటి ప్రపంచానికి తెలిసిందంటే..

దక్షిణ చైనా సముంద్రలో 4 కి.మీ.లోతున షిప్‌..

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం.. అన్ని దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. ఎక్కడికక్కడ యుద్ధ ఖైదీలను తరలిస్తున్నారు. అలా వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన ఓ జపాన్‌ నౌక ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీప తీరంలో దక్షిణ చైనా సముద్రంలో 4 కిలోమీటర్ల లోతున ఈ షిప్‌ను కనుక్కున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ చెప్పారు.

1942 జూన్ 22న హైనాన్ ద్వీపానికి చేరిక..

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూగినియాలో పట్టుబడిన వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో కూడిన ఓ జపాన్‌ నౌక.. 1942 జూన్‌ 22న అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయల్దేరింది.

ఇవి కూడా చదవండి

నౌకను ఢీ కొన్న అమెరికా జలాంతర్గామి..

అయితే, మిత్రరాజ్యాలకు చెందిన పౌరులను తీసుకెళ్తోందన్న విషయం తెలియని ఓ అమెరికా జలాంతర్గామి.. జులై 1న దాడి చేయడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియన్లతోసహా 14 దేశాలకు చెందిన మొత్తం 1,080 మంది జలసమాధి అయ్యారు.

81 ఏళ్లు కొనసాగిన సర్చింగ్..

ఈ క్రమంలోనే.. మునిగిపోయిన ఈ నౌక ఆచూకీని కనుగొనాలనే డిమాండ్‌ మొదలైంది. ఆస్ట్రేలియా రక్షణ శాఖ, పురావస్తు విభాగం, సైలెంట్‌ వరల్డ్ ఫౌండేషన్‌లు కలిసి.. నెదర్లాండ్‌కు చెందిన సముద్ర సర్వే సంస్థ ఫుగ్రో సాయంతో ప్రత్యేక మిషన్‌ను నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలతో సర్చింగ్‌ స్టార్ట్‌ చేశాయి. అలా 81 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఆ షిప్ ఆచూకీ లభ్యమైంది.

దక్షిణ చైనా సముద్ర గర్భంలో దొరికిన ఆచూకీ..

ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 81 ఏళ్ల తర్వాత దక్షిణ చైనా సముద్ర గర్భంలో నౌక ఆచూకీ లభ్యమైంది. దేశ సేవ చేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్న తమ నిబద్ధతను ఇది చాటుతుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. 81 ఏళ్ల తర్వాత ఓడ దొరికిందని సంతోష పడాలో, అంతమందిని మింగిన సముద్రాన్ని చూసి ఏమనాలో తెలియని పరిస్థితి. అయినా.. నాటి నౌక నేడు దొరికింది. ఎన్నో విషయాలను మనముందుకు తెచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..