Italy Election: యువత ఓటు చుట్టూ ఇటలీ రాజకీయాలు.. హామీలు గుప్పిస్తున్న పార్టీలు.. కానీ..

ఇటలీ చరిత్రలో తొలిసారిగా 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.. కొత్తతరం ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి అక్కడి పార్టీలు..

Italy Election: యువత ఓటు చుట్టూ ఇటలీ రాజకీయాలు.. హామీలు గుప్పిస్తున్న పార్టీలు.. కానీ..
Italy Election

Updated on: Sep 24, 2022 | 6:10 AM

Italy Election 2022: ప్రధానమంత్రి పదవికి మారియో ద్రాగి అర్ధంతరంగా రాజీనామా చేయడంతో ఇటలీ పార్లమెంటుకు ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ, డెమొక్రాటిక్‌ పార్టీ, ఫైవ్‌ స్టార్‌ మూవ్‌మెంట్‌, లీగ్, ఫోర్జా ఇటాలియా, థర్డ్‌పోల్‌, ఇటాలియన్‌ లెఫ్ట్‌, ఇటాలెగ్జిట్‌ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. కాగా ఈసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇటలీలో గతంలో 25 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటేయడానికి అర్హులు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓటర్ల వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఇటలీలో యువతరానికి (Italy Young Voters) ప్రాధాన్యత పెరిగిపోయింది.

యువ ఓటర్లకు గాలం వేసేందుకు ఇటలీ రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు గుప్పిస్తూ పడరాని పాట్లు పడుతున్నాయి.. మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, జార్జియా మెలోని, ఎన్రికో లెట్టా తదితర నాయకులు యువ హృదయాలను గెలుచుకోడానికి మరీ అతిగా వారిపై ప్రేమను కురిస్తున్నారు.. రాజకీయ పార్టీలు తమ మాణిఫెస్టోలో ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్‌షిప్‌తో పాటు తక్కువ ఆదాయం ఉన్నకుటుంబంలోని 18 ఏళ్లు నిండిన యువతకు ప్రతి నెలా 10 వేల డాలర్ల సాయంలాంటి హామీలను ఇస్తున్నాయి. కనీస వేతనం, వాతావరణ మార్పులు, అబార్షన్‌, LGBTI హక్కులు కూడా ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారాయి.

పార్టీలు యువత చుట్టూ తిరుగుతున్నా 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.. ఏ పార్టీ అధికారం చేపడితే మాకేం, ఓటు వేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అనే డైలాగ్స్‌ వినిపిస్తున్నారు. అయినప్పటికీ.. నాయకులు మాత్రం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి