AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giorgia Meloni: అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఇటలీ ప్రధాని మెలోని ఫొటోలు..! వాటిపై ఆమె ఏమన్నారంటే..?

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, ఇతర మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫికా అనే అడల్ట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడంపై ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను అసహ్యకరమని అభివర్ణించిన ఆమె, నేరస్థులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటన ఆన్‌లైన్ లింగ దుర్వినియోగాన్ని ఎత్తిచూపుతోంది.

Giorgia Meloni: అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఇటలీ ప్రధాని మెలోని ఫొటోలు..! వాటిపై ఆమె ఏమన్నారంటే..?
Giorgia Meloni
SN Pasha
|

Updated on: Aug 30, 2025 | 1:22 PM

Share

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఒక అడల్ట్‌ వెబ్‌సైట్‌లో తనతో పాటు ఇతర మహిళల ఫొటోలను మార్పింగ్‌ చేసి ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను అసహ్యకరమైనది అని అభివర్ణించారు. నేరస్థులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫికా అనే వెబ్‌సైట్‌కు 700,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, మెలోని, ఆమె సోదరి అరియానా, ఇటాలియన్ ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్ మార్ఫింగ్‌ ఫోటోలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, పబ్లిక్ సోర్సెస్ నుండి అనుమతి లేకుండా తీసిన ఈ చిత్రాలు, మహిళలను లైంగికంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారు.

మెలోని స్పందన

ఇలాంటి చర్యలు అసహ్యకరమైనవి అని మెలోని అన్నారు. బాధితులైన మహిళలందరికీ నా సంఘీభావం, మద్దతు ఉంటుందన్నారు. డిజిటల్ దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆమె మరింత హెచ్చరించారు.

దర్యాప్తు ప్రారంభం

సెంటర్-లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ సభ్యులతో సహా అనేక మంది మహిళల నుండి అధికారిక ఫిర్యాదులు అందిన తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చాలా వరకు మార్చబడిన ఫోటోలు సైట్ ప్రత్యేకమైన VIP విభాగంలో కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత చాలా మంది మహిళలు ఫికా, ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఫిర్యాదులు చేశారు. కొన్ని సోషల్‌ మీడియా గ్రూపుల్లో పురుషులు అనుమతి లేకుండా మహిళల సన్నిహిత ఫోటోలను పంచుకున్నారు, ఇది ఆన్‌లైన్ లింగ ఆధారిత దుర్వినియోగం విస్తృత సమస్యను ఎత్తి చూపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి