AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్ వివాదంలో దూరాలని చూస్తున్న ట్రంప్‌నకు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణకు క్రెడిట్ తీసుకుంటున్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఆఫర్ చేయడం ద్వారా జస్టిస్ చౌదరిగా మారుతున్నారు. కానీ అమెరికా స్నేహితుడిగా భావించే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలను నెతన్యాహు తిరస్కరించారు.

భారత్-పాక్ వివాదంలో దూరాలని చూస్తున్న ట్రంప్‌నకు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్!
Trump Netanyahu
Balaraju Goud
|

Updated on: May 14, 2025 | 12:04 PM

Share

మొన్నటిదాకా భారత్‌-పాక్‌ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌, కాల్పుల విరమణ కాగానే, మాటమార్చారు. ఇదంతా తనవల్లే అంటున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను భారత్‌ ఖండించినా, ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. క్రెడిట్‌ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇటీవల సౌదీలోని రియాద్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌లోనూ ట్రంప్‌ ఇలాగే మాట్లాడారు.

భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత, ట్రంప్ ప్రతిచోటా దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. తన సౌదీ పర్యటన సమయంలో తన ప్రసంగంలో తనను తాను ప్రశంసించుకున్నాడు. భారత్-పాకిస్తాన్ శాంతికి ఘనతను తీసుకున్నాడు. అంతే కాదు, కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని కూడా ట్రంప్ అన్నారు. ఆ తరువాత అతనికి భారత ప్రభుత్వం నుండి తగిన సమాధానం వచ్చింది. అయితే తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది.

ట్రంప్ శాంతికర్తగా ఉండటానికి ఆసక్తిగా ఉన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, హౌతీలు-సిరియా, భారత్-పాకిస్తాన్‌లో శాంతి కోసం అనేక ఒప్పందాలు, చర్చలు జరుగుతున్నాయి. హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తీసుకురావడానికి ఆయన హమాస్‌తో ప్రత్యక్ష చర్చలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీరుపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా నిరంతర ప్రయత్నాల తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ఆపడానికి “ఎటువంటి మార్గం” లేదని అన్నారు. బందీలను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరినప్పటికీ, హమాస్ అంతమయ్యే వరకు తన ప్రచారం కొనసాగుతుందని ఆయన అన్నారు.

ట్రంప్ మధ్యప్రాచ్యానికి వచ్చిన రోజున గాజాలోని రెండు ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందులో కనీసం ఎనిమిది మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.

నెతన్యాహు వ్యాఖ్యలు కాల్పుల విరమణ చర్చలను క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు హమాస్ చేసిన సంజ్ఞ ద్వారా ఈ చర్చలు పునరుద్ధరించారు. హమాస్ అమెరికన్ బందీలను విడుదల చేసినప్పుడు మాత్రమే ముందడుగు పడనుంది. ట్రంప్ ప్రస్తుతం మధ్యప్రాచ్య పర్యటనలో ఉన్నారు. తన పేరుకు మరో కాల్పుల విరమణను క్రెడిట్ తీసుకోవాలని ఆశిస్తున్నారు.

అదే సమయంలో, నెతన్యాహు వైఖరి ఆయనకు, ట్రంప్ కు మధ్య పెరుగుతున్న అంతరాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలను చూస్తుంటే, అమెరికా-ఇజ్రాయెల్‌కు ఈ విధంగా సహాయం చేస్తూనే ఉంటుందా లేదా దానిలో కోత విధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..