AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రసంసల వర్షం.. భారత దేశం తన ఇల్లు అంటున్న పోలినా వీడియో వైరల్

భారత సైన్య దైర్య సాహసాలు, యుద్ధ నీతి, యుద్ధ తంత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అని భారతీయులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశంసల వర్షం.. అయితే తాజాగా ఓ రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గురుగ్రామ్‌లో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ భారత సైన్యం ధైర్యసాహసాలను కీర్తిస్తూనే భారతదేశాన్ని తన ఇల్లు అని చెప్పింది పోలినా అగర్వాల్.

Viral Video: భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రసంసల వర్షం.. భారత దేశం తన ఇల్లు అంటున్న పోలినా  వీడియో వైరల్
Russian Woman Praises Indian Army
Surya Kala
|

Updated on: May 14, 2025 | 1:09 PM

Share

భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య.. ఒక రష్యన్ మహిళ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ( రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసించింది ) భారతదేశాన్ని తన ఇల్లు అని పిలుస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివసించే రష్యన్ పోలినా అగర్వాల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

భారత సైనికుల ధైర్యసాహసాలను, దేశాన్ని రక్షించడంలో వారి అచంచల అంకితభావాన్ని పోలినా ప్రశంసించింది. ఆమె తన భావోద్వేగ సందేశంలో, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వార్త విన్న వెంటనే.. రష్యాలో నివసిస్తున్న తన అమ్మమ్మ తనను వెంటనే ఇంటికి తిరిగి రమ్మని కోరింది. అప్పుడు అమ్మమ్మని ఏ అల్లు అని అడిగాను.. నేను ప్రస్తుతం నా ఇంట్లో అంటే భారత దేశంలో ఉన్నానని రష్యన్ అమ్మమ్మకి చెప్పినట్లు వెల్లడించింది పోలేనా.

ఇవి కూడా చదవండి

ఓ వైపు భారత సైన్యం వద్ద అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయని.. వీటిని రష్యా స్వయంగా అందించిందని ఆమె చెబుతోంది. దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించే డ్రోన్లు లేదా జెట్‌లు లేదా ఏదైనా ఎగిరే వస్తువు ఏదైనా సరే వీటి ముందు పని తీరు ముందు నిలవ లేవని.. అంత బలంగా పనిచేస్తాయని చెప్పింది. మరోవైపు భారత సైనికుల నిస్వార్థ స్ఫూర్తిని కూడాప్రశంసించారు. వారి అంకితభావం వల్లే మేము రాత్రివేళల్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని పోలినా అన్నారు. సరిహద్దులో అసలు ఏమి జరుగుతోందని మాకు తెలియదన్నారు.

చివరగా ఆమె భారతదేశాన్ని నా ఇల్లు ప్రశాంతమైన దేశం అని పిలవడానికి భారత సైనికుల అంకితభావమే కారణం అని..తమని రక్షిస్తున్న సైనికులకు కృతజ్ఞురాలీని అని చెప్పింది. ఈ వీడియోను 1.5 లక్షల మందికి పైగా చూశారు. రష్యన్ యువతి దేశం పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమని.. సైనికులపై ఉన్న నమ్మకానికి కదిలిపోయారు. ఇ

వీడియోను ఇక్కడ చూడండి

ఒకరు “మన సైనికులకు సెల్యూట్” అని వ్యాఖ్యానించారు. “మరొకరు మన సాయుధ దళాల పట్ల ఇంత ప్రేమ, గౌరవాన్ని చూపించడం చూడటం చాలా ఆనందంగా ఉంది” అని కామెంట్ చేశారు. ఇది చాలా అందమైన , శక్తివంతమైన సందేశం అని అన్నారు. సైనికులే మా దేశ శాంతిని కాపాడే బలం.. వారి త్యాగాన్ని గుర్తించినందుకు పోలినాకు చాలా ధన్యవాదాలని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..