AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం..! పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌..?

ఏప్రిల్ 22న పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి కాల్పుల విరమణకు దోహదపడ్డాడు. అయితే ఈ విషయంలో చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌తో చైనా సన్నిహిత సంబంధాల కారణంగా ఈ అసంతృప్తి ఉంది. తరువాత మళ్ళీ కాల్పులు జరిగాయి.

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం..! పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌..?
Pm Narendra Modi Jinping Pa
SN Pasha
|

Updated on: May 14, 2025 | 11:52 AM

Share

ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత.. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఉగ్రవాడిలో మరణించిన 26 మంది ప్రాణాలకు ప్రతీకారంగా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే లక్ష్యంలో భాగంగా.. మే 6, 7 మధ్య పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత బలగాలు. అయితే.. ఇది తమ దేశంపై, దేశ పౌరులపై చేసిన దాడి అంటూ పాకిస్థాన్‌ సైనిక దాడులకు తెగబడింది. భారత్‌ కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది.

అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు ఇలా యుద్ధానికి సిద్ధమవ్వడంతో అగ్రరాజ్యాలు అమెరికా, చైనా కూడా భారత్‌, పాక్‌ శాంతించాలని, చర్చలు జరుపుకోవాలని సూచించాయి. అయితే ఉన్నపళంగా ఒక రోజు ఇరు దేశాలు కాల్పుల విమరణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టాడు. ఆ వెంటనే భారత్‌, పాక్‌ ప్రభుత్వాలు కూడా కాల్పుల విమరణకు ఒప్పుకుంటున్నట్లు అంగీకరించాయి. తానే ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు కారణం అంటూ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. కానీ, ఈ విషయంలో చైనా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో భారత్‌, పాక్‌, అమెరికా హాట్‌లైన్లు బిజీగా ఉన్నాయి.

కానీ, చైనాను ఆ చర్చల్లో భాగస్వామిని చేయలేదని సమాచారం. ఇదే విషయంలో పాకిస్థాన్‌పై చైనా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు బిగ్‌ బ్రదర్‌లాగా ఉండే తమను కాదని, మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించడంపై చైనా ఆగ్రహంగా ఉంది. కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత చైనా, పాకిస్థాన్‌తో చర్చలు జరిపింది. ఆ తర్వాత మళ్లీ భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడింది. ఆ తర్వాత కాల్పులు ఆపేసింది. కాగా, భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణకు అమెరికాతో పాటు చైనా కూడా క్రెడిట్‌ తీసుకోవాలని ఆశపడుతోంది. అందుకే తమకు తగిన ప్రాధాన్యత లేకుండా చేసిన పాకిస్థాన్‌ చైనా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..