బిల్ గేట్స్(Bill Gates ) బహుశా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. అలాంటి ప్రముఖుడు ఇటీవల తొలిసారిగా పాకిస్తాన్‌లో(Pakistan) పర్యటించారు. బిల్ గేట్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఫొటోలను తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan). ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు సీక్రెట్‌ను దాచేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు పాక్ ప్రధాని. ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన ఫొటోలో ఓ వ్యక్తిని మార్ఫ్ చేసినట్లు కన్పిస్తోంది. అయితే ఆ మార్ఫింగ్ చేసిన స్థలంలో ఉన్న వ్యక్తి ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అంజున్ ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో ఐఎస్‌ఐ చీఫ్‌ను దాచిపెట్టారంటూ ఇమ్రాన్‌పై నెట్టింట్లో విమర్శలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 17న ఇమ్రాన్ ఈ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఇమ్రాన్ పోస్ట్ చేసిన వెంటనే అందులో ఒక వ్యక్తిని ఫొటోషాప్ సాయంతో మార్ఫ్ చేసినట్లు నెటిజన్లు. ఆ ఫొటోలో బిల్‌గేట్స్, ఇమ్రాన్ సహా, అందరూ ఆ వ్యక్తి వైపే చూస్తున్నట్లుగా ఉండటంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అన్న ఆసక్తి మొదలైంది.
Prime Minister @ImranKhanPTI‘s luncheon in honor of @BillGates
Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki
— Prime Minister’s Office, Pakistan (@PakPMO) February 17, 2022
ఎందుకు మార్ఫ్ చేశారా అన్న ప్రశ్న తలెత్తింది. ఆయన ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అని ఈ సమావేశంతో సంబంధమున్న వ్యక్తులు కొందరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్‌ఐ చీఫ్, ప్రభుత్వానికి చెప్పారట. అందుకే తాజా ఫొటోలో ఆయన ముఖాన్ని మార్ఫ్ చేసినట్లు తెలుస్తోంది.
గతేడాది అక్టోబరులో ఐఎస్‌ఐ నూతన చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియమితులయ్యాడు. నదీమ్ నియామకాన్ని ఆర్మీ మీడియా వింగ్ ప్రకటించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇమ్రాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య అంతర్గత పోరుపై వార్తలు జోరుగా మొదలయ్యాయి. ఏదేమైనా అతని ఫొటోను మార్ఫ్ చేయడానికి ఇంకా ఎదో పెద్ద కారణమే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి: Raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశం..