యుద్ధం తర్వాత తొలిసారి కనిపించిన ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ
ఇజ్రాయెల్‌తో వివాదం తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు వచ్చారు. శనివారం (జూలై 5) టెహ్రాన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.

ఇజ్రాయెల్‌తో వివాదం తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు వచ్చారు. శనివారం (జూలై 5) టెహ్రాన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక అధిపతి, అణు నిపుణులతో సహా అనేక మంది ఉన్నతాధికారులు మరణించారు.
జూన్ 14 నుంచి ఖమేనీని ఎవరూ చూడలేదు. ఇటీవల ఆయన తన సలహాదారు అలీ లారిజానీని కలిసినట్లు సమాచారం. ఇరాన్ షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన, భావోద్వేగమైన మొహర్రం సంతాప దినాలలో, ముఖ్యంగా మొహర్రం కార్యక్రమానికి హాజరయ్యారు. షియా ముస్లిం క్యాలెండర్‌లో అతి ముఖ్యమైన రోజు అయిన అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఖమేనీ ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్‌ను ఇరాన్ స్టేట్ టీవీ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఆయన ఈ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొంటారు.
ఖమేనీ తన సాంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనసమూహం నినాదాలు చేస్తూ కనిపించింది. జూన్ 14న యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నాయకుడు బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. వైమానిక దాడుల మొదటి కొన్ని రోజుల్లో ఖమేనీ కనిపించకుండాపోయారు. కానీ ఆ యుద్ధ సమయంలో రికార్డ్ చేసిన సందేశాలు విడుదల చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం సమయంలో పెరుగుతున్న భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రధాన మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన వార్షిక ప్రసంగంతో సహా ఆయన ప్రసంగాలు ముందే రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రసారం చేశారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య భద్రతా ప్రోటోకాల్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
వైమానిక దాడులు, రహస్య కార్యకలాపాలతో కూడిన ఇజ్రాయెల్ సంఘర్షణ విస్తృతమైన ప్రాంతీయ అస్థిరత గురించి ఆందోళనలను లేవనెత్తింది. అయితే ఇరాన్ పాలన నిరంతరం పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ తన సత్తాను చాటుతూనే ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..